Monday, September 9, 2024
spot_img

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

తప్పక చదవండి
  • వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
  • కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
  • ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
  • ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు

వికారాబాద్‌ జిల్లా తాండూరు లో 5 నెలల శిశువు పై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన అందరి హృదయాలను కలిసివేసింది . విక్షణంగా దాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం మహబూబ్ జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతి పరిధి బసవేశ్వర నగర్ లో సంగెంకలాన్ గ్రామానికి చెందిన జి.నాగభూషణంకు చెందిన పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం వీరికి వివాహము జరిగింది. గత 5 నెలల క్రితం వీరికి బాలుడు(సాయి నాథ్‌) అనే బాలుడు ఉన్నాడు . మంగళవారం ఉదయం దత్తు యూనిట్లో పనిచేస్తుండగా, దత్తు దాహం వేయడంతో భార్యకు నీళ్లు తీసుకు రమ్మని అడిగా భార్య లావణ్య ఇంటి బయటకు వచ్చి భర్తకు నీళ్ళు అందించింది. ఇంతలో పాలిషింగ్‌ యూనిట్ యజమానికి చెందిన పెంపుడు కుక్క ఇంట్లోకి వెళ్లి పసి కందు పై దాడి చేసి పికతింది. అప్పటికే కేకలు విన్న కుటుంభీకులు వచ్చి చూసే సరికి పసి కందు మృతి చెందాడు. మృతికి కారణమైన కుక్కను ఆవేశంతో కుటుంభ సభ్యులు దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వచ్చిన వార్త కథనాలు చూసి కరణ్ కోట్ ఎస్ ఐ విట్టల్ రెడ్డి పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించారు. పెంపుడు కుక్క ఎవరు అనేది వాటిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు వెల్లడించారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు