Wednesday, May 1, 2024

వరాలిచ్చే దేవుడి స్థలానికి అక్రమార్కుల శాపం..

తప్పక చదవండి
  • న్యాయస్థానం ఆదేశాలు సైతం బుట్టదాఖలు
  • బహదూర్ పూరా, దేవీ భాగ్ లో వెలుగు చూసిన అక్రమం..
  • నిషేధిత స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
  • చెవిటివాడిలా మారిపోయిన దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్..
  • గుడికి దానంగా ఇచ్చిన భూమిని రక్షించడంలో ఫెయిల్యూర్..
  • ఈ అక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ పాత్ర ఎంత..?
  • కొలువైన కొత్త ప్రభుత్వం ఈ వ్యవహారంపై కన్నేయాలి..
  • అక్రమార్కులని కఠినంగా శిక్షించాలి..

వరాలిచ్చే దేవుడి మాన్యాలకే రక్షణ కరువైపోయింది.. అలాంటి మాన్యాల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అయినా.. నిమ్మకు నీరెత్తినట్టుండటం దురదృష్టం.. ప్రభుత్వ అధికారుల సహకారం లేనిది ఇలాంటి భూములను ఆక్రమించి నిర్మాణాలను చేపడ్డటం సాధ్యం కాదు.. గత ప్రభుత్వ దాష్టీకం వల్లనే ఇదంతా జరుగుతోందని విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి.. పైగా న్యాయస్థానం ఆదేశించినా అక్రమార్కులు పట్టించుకోవడం లేదంటే ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో ఆలోచించవచ్చు.. హైదరాబాద్‌ ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనర్ బాలాజీ పూర్తిగా చెవిటివారిగా మారిపోయారు.. కోర్టు చెప్పినా.. ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా దేవాలయం కోసం ఎవరో దానం చేసిన ఆస్తిని రక్షించడంలో ఆయన పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.. ఎలాటి తగిన చర్యలు తీసుకోలేదు. ఇది ఇలాగే కొనసాగడం ఎంతో ప్రమాదకరం.. ఇప్పటికైనా అసిస్టెంట్ కమీషనర్ తన బాధ్యతను నిర్వర్తించాలని పలువురు కోరుతున్నారు.. న్యాయస్థానం ద్వారా స్టేటస్ కో మంజూరు చేయబడినా.. ఇంత నిర్లక్ష్యం వహించడం క్షమించరాని నేరం.. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతునే ఉన్నాయి.

బహదూర్ పూరా, దేవీ బాగ్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. లోపాయికారి ఒప్పొందం చేసుకుని కబ్జాదారులకు సహకరిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. దేవాలయానికి భక్తులు దానం చేసిన ఆస్థిని రక్షించడంలో అసిస్టెంట్ కమిషనర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు కానీ, ఏవి కూడా చేయొద్దని.. యధాస్థితిని (స్టేటస్ కో) మెయింటైన్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చినా… జి.హెచ్.ఎం.సి, టౌన్ ప్లానింగ్ అధికారులు ముడుపులు తీసుకోని, దేవుని మాన్యంలో నిర్మాణానికి అనుమతులివ్వడం గమనార్హం. కోర్ట్ ఉత్తర్వులు ఉన్న కూడా, ఎండోమెంట్ భూమిలో భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఈ వవ్యహారం వెనుక జి.హెచ్.ఎం.సి అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఉన్నట్లు బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవేవి పట్టనట్టు కబ్జాదారులు యదేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా చర్యలు తీసుకోవలసిన అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ ప్రేక్షక పాత్రలో ఉండడం అత్యంత బాధాకరం. ఈ విషయంపై స్థానిక ప్రజలు ఎండోమెంట్ కమిషనర్, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అసిస్టెంట్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. దేవాదాయ ధర్మాదాయ భూముల్లో భాజాప్తగా భారీనిర్మాణాలు చేస్తున్నా, అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా ఈ విషయంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రద్ధ వహించి, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకొని కబ్జాకు గురైన స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యాలని, దేవుని మాన్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలతో మరిన్ని కథనాలను మీముందుకు తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు