Wednesday, May 22, 2024

సర్కార్ భూమి కాపాడలేని ఎమ్మార్వో ఎందుకు..?

తప్పక చదవండి
  • బోడుప్పల్ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల జోరు
  • కాసుల వేటలో రెవెన్యూ సిబ్బంది…!
  • సర్కార్ మారినా.. అధికారులు మారరా..!
  • అవినీతికి కేరాఫ్ గా మారిన మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం …?
  • డబ్బులిచ్చుకో.. 58 జీవో తెచ్చుకో…
  • ఆలస్యంగా వెలుగులోకి రెవిన్యూ అధికారుల నిర్వాకం…
  • ప్రభుత్వ భూములలో నిర్మాణాలు జరిగితే మీకేంటి : ఆర్ఐ నాగవల్లీ

మేడిపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు.ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నా అవేమీ పట్టనట్లు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం, అధికారుల చేతివాటంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందనే విమర్శలు వస్తున్నాయి.ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ విక్రయిస్తున్నారు. అసలు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవిన్యూ శాఖ అధికారులది కాదా… అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ తెలిసినా కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారా… అని ఆశ్చర్యపోతున్నారు. ముడుపులు తీసుకోవడం‌లో ఉన్న శ్రద్ధ వారి పని తీరు పై లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బడా బాబులు, నాయకులతో రెవిన్యూ అధికారులు చేతులు కలిపే ఈ తంతు నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి…..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూకబ్జాలకు అడ్డుకట్ట వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పుతున్నప్పటికి భూఆక్రమణలు అగకపోవడం గమనార్హం. కేసులు నమోదు చేయడంతోనే తమ పనిపోయినట్లుగా అధికారులు భావిస్తుండటంతో భూ కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారు. ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఖాళీగా కన్పిస్తే అక్కడ వాలిపోతున్నారు.కబ్జాదారులకు కబ్జాలకు పాల్పడుతుంటే రెవెన్యూ సిబ్బంది సహకరం అందడంతో వారు ఎంతగా బరితెగించారో అర్థమవుతోంది.గతంలో పని చేసిన తహసీల్దార్ అక్రమ నిర్మణాలపై ఉక్కుపాదం మోపి స్థలాన్ని కాపాడితే ప్రస్తుత అధికారులు నిఘా లేకపోవడంతో.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు… వివరాల్లోకి వెళ్ళితే మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 63/28నుండి 63/39 వరకు గల ప్రభుత్వ భూమిలో కబ్జా కాగ మిగిలిన భూమిని మున్సిపల్ సమీకృత భవనాలకు కేటాయించాలని కార్పోరెషన్ తీర్మానం చేసి అప్పటి కలెక్టర్ ను కోరారు.దీనిపై స్పందీంచిన కలెక్టర్ సర్వే చేయాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.దీంతో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుంక కాపాడుతున్నారు.కానీ కొందరూ అక్రమార్కులు భూమిపై కన్ను వేసి నిరుపేదలకు విక్రయించి సోమ్ము చేసుకుంటున్నారు.ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత కలిగిన రెవిన్యూ శాఖ అధికారులు అక్రమార్కులకు వంత పాడుతూ ముడుపులు తీసుకొని సహకరిస్తున్నారని ప్రజలు బాహటంగానే అనుకుంటున్నారు.నిరుపేదలు ఎవ్వరైనా గుడిసె వెయ్యగానే వాలిపోయే రెవిన్యూ అధికారులు బడాబాబులు యదేచ్ఛంగా బిల్డింగ్ నిర్మాణం చేస్తుంటే వాటిని ఎట్లా రక్షించుకోవాలో వారే సలహలు ఇస్తుండటం ఆశ్చర్యం వేస్తుంది.కంచె చేను మేస్తే నాకేంటి…లాగా అధికారులు వ్యవహరిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రభుత్వ భూమిని కాపాడి ప్రజా అవసరాలకు వినియోగించాలని ప్రజలు కోరుచున్నారు.

- Advertisement -

మూగబోయిన తహసీల్దార్ చరవాణి….

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎవరైనా మేడిపల్లి తహసీల్దారు కు ఫీర్యాదు చేస్తే వెంటనే పరిశీలిస్తామని దాటవేస్తుంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవిన్యూ శాఖ అధికారులది కాదా… అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ తెలిసినా కూడా తెలియనట్టు వ్యవహరించడంతో దీనిపై వివరణ కొరకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన తహసీల్దార్ చరవాణి మూగపోతుంది.ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారి ఇలా వ్యవహరించడం సరి కాదని ప్రజలు అనుకుంటున్నారు..

పైసలు కొట్టు 58 జీవో పట్టా పట్టు..

సమగ్రం సర్వే చేసి పట్టా అందించవలసిన రెవిన్యూ అధికారులు ప్రభుత్వానికి,ప్రై వేట్ వ్యక్తులకు మద్య కేసు నడుస్తున్న ఖాళీ స్థలానికి దళారులతో చేతులు కలిపి పట్టా ఇచ్చిన వైనం అలస్యంగా వెలుగులోకి వచ్చింధి. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి భూమి క్రమబద్ధీకరణకు ఆధార్‌ కార్డు, ఆక్రమిత స్థలంలో నివాసాన్ని ధ్రువీకరించే ఇతర పత్రాలను సమర్పించాల్సి ప్రభుత్వం చెప్పితే నిరుపేదలకు ముప్పుతిప్పలు పెట్టి పట్టా ఇస్తే…. రెవిన్యూ అధికారులు కాసులకు కకుర్తిపడి దళారులకు ఖాళీ స్థలాలకు 58జీవో ను అసరా చేసుకొని పట్టాలు పంపిణీ చేశారు.ప్రభుత్వ భూమిని కాపాడవలసిన అధికారులే ఇలాంటి నిర్వాహకం చెయడమేటని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ఇచ్చిన పట్టాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుచున్నారు.

ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారదా…?

గత ప్రభుత్వంలో ఎన్నో కబ్జాలు,అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అధికారులకు ఆదేశాలు ఇస్తే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న రెవిన్యూ అధికారుల వాటిపై దృష్టి సారించడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారదా..అని విసుకుంటున్నారు.

ప్రభుత్వ భూములలో నిర్మాణాలు జరిగితే మీకేంటి : ఆర్ఐ నాగవల్లీ

ప్రభుత్వ భూములలో నిర్మాణం జరుగుతుందని కొందరూ ఫీర్యాదు చేస్తే ప్రభుత్వ భూములలో నిర్మాణాలు జరిగితే మీకేంటి…. కబ్జాదారులకు వత్తాసుగా ఏమి చేసుకుంటారో చేసుకొండని రెవిన్యూ ఇన్స్పెక్టర్ నాగవల్లీ సమాధానం ఇస్తుండటంతో ఫీర్యాదుదారులు విస్తుపోయారు.గతంలో కూడా పర్వతాపూర్ లోని సర్వేనంబర్ 10,11 సీలింగ్ భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఎన్నో ఫీర్యాదులు వచ్చిన పట్టించుకోకపోవడంతో జోరుగా నిర్మాణాలు జరిగాయి.ఉన్నతాధికారులకు ఫీర్యాదు రావడంతో కూల్చారు.మళ్ళీ రెవిన్యూ ఇన్స్పెక్టర్ నాగవల్లీ ని బోడుప్పల్ కార్పోరేషన్ పంపడటంతో ప్రభుత్వ భూములు కబ్జాదారులకు కట్టబెట్టడం ఖాయమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు