Wednesday, April 24, 2024

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

తప్పక చదవండి
  • పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు
  • అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌
  • ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు
  • నాణ్య‌త లోపించిన భోజ‌నం.. ప్ర‌శ్నిస్తే అర్థ ఆక‌లితో ఇబ్బందులు
  • శుభ్రత లేని పాఠ‌శాల టాయిలెట్‌లు, పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌
  • ప‌ట్టించుకోని పాఠ‌శాల విద్యాశాఖ‌

విద్యార్థుల‌కు విద్యాబుద్ధులు నేర్పించి, స‌న్మార్గంలో న‌డిపించాల్సిన ఉపాధ్యాయులే.. అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు పాల్పిడి, పాఠ‌శాల ప‌రువు ప్ర‌తిష్ట‌ను దిగ‌జారుస్తూ.. ఉపాధ్యాయ వృత్తికే క‌ల‌కం తెస్తున్నారు కొంద‌రు ఉపాధ్యాయులు.. పెద్దపల్లి జిల్లా, ఓదెల మండ‌లంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ప్రిన్సిప‌ల్ జావేద్‌, ఉపాధ్యాయుల బాధ్యాత‌రాహిత్యం వ‌ల్ల పాఠ‌శాల‌కు చెడ్డ‌పేరు తేవ‌డంతో పాటు పిల్ల‌ల భ‌విష్య‌త్తును ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. పాఠ‌శాల‌లో ప్రైవేట్ పార్టీలు జ‌రుపుకుంటూ.. సంస్కారం నేర్పాల్సిన ఉపాధ్యాయులే సంస్కారహీనులుగా ప్ర‌వ‌ర్తించ‌డం శోచ‌నీయం. బాధ్య‌త‌గ‌ల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అసాంఘిక కార్య‌క‌ల‌పాల‌కు పాల్ప‌డుతున్న వారికి ప్రిన్సిప‌ల్ జావేద్ స‌హ‌క‌రించ‌డం సిగ్గుచేటు.

ప్రిన్సిపాల్ తన కింద పనిచేసే కొందరు స్టాఫ్ తో లాలూచీ పడి సరిగా లీవ్ అకౌంట్ రికార్డ్ చేయడం లో నిర్లక్ష్యం వ‌హిస్తున్నారు. చైల్డ్ కేర్ లీవ్ ముందస్తు అనుమతి లేకుండానే యధేచ్ఛగా వాడుకుంటూ ఫిబ్రవరి, మార్చి 2024 లో కొందరు టీచర్స్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారు. అలాగే గంట‌ల వారిగా బోధించే ఉపాధ్యాయుల్లో ఒకరు జనవరి నెలలో ఐదు రోజులు, ఫిబ్రవరి 2024 లో రెండు రోజులు స్కూల్ కి రాకున్నా ఫుల్ శాలరీ తీసుకున్న‌ట్లు, వొకేషనల్ టీచర్ ఫిబ్రవరి 2024 లో వారం రోజులు స్కూల్ కి రాకున్నా వేరే వాళ్లతో అటెండెన్స్ రిజిస్టర్ లో దొంగ సంతకాలు చేపించ‌డం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ గా స్కూల్ కి రాకున్నా వారి విధులు నిర్వర్తించకున్నపిఈటి, కంప్యూటర్ ఆపరేటర్ రోజుల తరబడి టైం కి రాకున్న వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా, పూర్తి వేతానాలు చెల్లిస్తూ, ప్రిన్సిప‌ల్ ప్రేక్ష‌క పాత్ర‌లో ఉండ‌డం ప‌లు అనుమానాల‌కు తావీస్తుంది.

- Advertisement -

బస్ పాస్, స్కాలర్ షిప్స్ అప్లయ్ పేరుతో విద్యార్థులందరి నుండి రూ. 50 నుండి రూ. 100 వసూలు చేసినా.. ఎగ్జామ్ పీసు పేరుతో ఎక్కువ తీసుకున్న, వాళ్లతో లోపాయికారీ ఒప్పందం వల్ల, కేవలం తన గ‌దికి ప‌రిమితమై పర్యవేక్షణ బాధ్యతలను గాలికి వ‌దిలేసి, విద్యాసంవ‌త్స‌రంలో సిల‌బ‌స్ పూర్తికాకుండా విద్యార్థులు చ‌దువులో వెనుక‌బ‌డి, పాఠ‌శాల‌పై దుష్ప్ర‌చారం జ‌రుగ‌డంతో నూత‌న విద్యాసంవ‌త్స‌రంలో అడ్మిష‌న్లు త‌గ్గిపోతున్నాయి. కొందరు ఉపాధ్యాయుల పుట్టిన రోజు వేడుకలు విద్యార్థుల డబ్బు తో గత పది సంవత్సరాలుగా అట్ట‌హాసంగా జ‌రుపుకుంటున్న‌, పాఠశాల వాతావరణం కలుషితం చేస్తున్నారనే ఆరోప‌ణ‌లు ప‌లు వార్తా ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన‌ప్ప‌టికి, అప్పటి పాఠ‌శాల విద్యాశాఖ ఆడిషనల్‌ డైరెక్టర్ దృష్టికి వచ్చిన కఠిన‌చర్యలు లేక, అలాంటి సంఘ‌ట‌న‌లే కొన‌సాగుతున్నాయి. పాఠ‌శాల‌లో మౌలిక వ‌స‌తులపై దృష్టి సారించ‌కుండా నిర్లక్ష్యం వ‌హిస్తూ విద్యార్థుల ఇబ్బందుల‌ను ప‌ట్టించుకోకుండా ప్రిన్సిప‌ల్ త‌న గ‌దికి ప‌రిమితం కావ‌డం బాధాక‌రం. పాత టెక్స్ట్ బుక్స్ ఇతర మెటీరియల్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మి జేబులు నింపుకొని, స్కూల్ నిధులను ఇష్టారాజ్యంగా అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేసినట్టు సమాచారం.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అవర్లీ బేస్డ్, వోకేషన్ మరియు రెగ్యులర్ ఉద్యోగుల హాజరు రిజిస్టర్ లు వారి లీవ్ ల లెక్కలు సరిగ్గా నమోదు చేయడంలో ప్రిన్సిపాల్ నిర్లక్షంగా ఉండడం వల్ల మరియు కొందరు నెలలకు నెలలు స్కూల్ కి రాకున్న వారి జీతం డ్రా చేసి అవకతవకలకు పాల్పడ్డారు. 2020 డిసెంబర్ నెలలో చివరి 7రోజులు, 2021జనవరి లో మొదటి 11 రోజులు ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడి సంతకం లేకున్న జీతం డ్రా చేసారు. అదే ఉపాధ్యాయుడు 2019 మార్చి 15 నుండి 18 వరకు ఐపిఈ స్పాట్ వాల్యేషన్ క్యాంప్ లో జాయిన్ కాకున్న ఓడి వేసుకొని 19 మార్చిన మళ్ళీ స్కూల్ లో ఎలాంటి అటెండెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చెయ్యకుండానే జాయిన్ అయ్యినట్టు తెలుస్తోంది. 2013 నుండి నేటి వరకు రిజిస్టర్ లు చూస్తే ఇలాంటి వి కోకొల్లలు కనపడుతాయి.

విద్యార్థుల సంఖ్య తగ్గిన కూడా హిందీ బోధించే రెగ్యులర్ ఉపాధ్యాయుడు (కేవలం 9 &10 క్లాసెస్ కి వారానికి 16 సబ్జెక్టు పీరియడ్స్ ఏ చెప్పుతున్న) వున్న కూడా అవర్లి బేస్డ్ లో హిందీ ఉపాధ్యాయుడిని కూడా తీసుకున్నట్టు, ఇద్దరు కూడ 30 సబ్జెక్టు పీరియడ్ లు బోధిస్తున్నట్టు, జీతం డ్రా చేసి అవకతవకలకు పాల్పడి నట్టు తెలుస్తోంది. అవర్లి బేస్డ్ టీచర్స్ కి ఫిబ్రవరి, మార్చి నెలలో క్లాసెస్ ఒక్కటి కూడా లేకున్న వారితో కుమ్మక్కు అయ్యి వారిని తీసివేయకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ శాలరీ చేస్తునట్టు, కొందరు కోర్టు కేస్ పేరు మీద, బయటి పనుల పేరు మీద స్కూల్ కి రాకున్నా మరుసటి రోజు వచ్చి కొన్ని సంవత్సరాలుగా రిజిస్టర్ లో సంతకం చేస్తునాట్టు మరియు సీఎల్ లను ఓడి లు గా మారుస్తూ అవకతవకలకు పాల్పడ్డారు అని తెలుస్తోంది.

పైసలు ఇస్తే చాలు ఎన్ని ట్రాన్స‌ఫ‌ర్ సర్టిఫికేట్లు అయిన విడుద‌ల చేస్తాడు ప్రిన్సిప‌ల్ జావేద్‌. ఒక ఉపాధ్యాయుడు వాళ్ల పిల్లల పేరు మీదే 2019-20 విద్యా సంవ‌త్స‌రానికి రెండు రెండు టీసీలు తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. (టీసీ నెం. 3607-17775 అడ్మిష‌న్ నెం. 1005 మరియు టీసీ నెం : 3607-17776 అడ్మిష‌న్ నెం 1006 పదవ తరగతి అయిపోయినట్టు తేది 06/08/2021 రోజు, టీసీ నెం : 089 అడ్మిష‌న్ నెం 641 తేదీ 11/08/2021 నాడు అలాగే టీసీ నెం : 090 అడ్మిష‌న్ నెం 602 తేది 08/09/2021 రోజు ఇంట‌ర్ మొదటి సంత్స‌రం ఎంపీసీ మ‌ధ్య‌లో నిలిపివేసిన‌ట్లు) కేవలం వారం రోజులు లోపే ఇష్టారాజ్యంగా టీసీ లు తీసుకున్నట్టు తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.

పదవ తరగతి విద్యార్థులకు ఇచ్చే ఈవెనింగ్ స్నాక్స్ ఇచ్చేది గోరంత, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపి గత రెండు మూడు సంత్సరాలుగా అవక తవకలకు పాల్పడుతున్నారు. హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినిల పేరు మీద స్కాలర్ షిప్స్ కి అప్లై చేసి వారి నుండి డబ్బు లు తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. మ‌ధ్యాహ్న భోజ‌నం వండే వారి స్థానంలో వేరే వాళ్లు గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన కూడా, వాళ్ళతో కుమ్మక్కై, ఆ విష‌యాలు బయటకు రాకుండా ప్రిన్సిప‌ల్ జావేద్ సపోర్ట్ చేస్తుండడం, విద్యార్థులకు నాణ్యత లోపించిన భోజనం, పురుగుల ఆహారం, వారంలో రెండు సార్లు పెట్టాల్సిన గుడ్డు కూడా పెట్ట‌డం లేద‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఈ అక్ర‌మ వ్య‌వ‌హారాల‌పై విద్యార్థులు నిల‌దీస్తే, వారిని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తూ.. అర్థ ఆకలితో ఉంచుతున్న‌ట్లు విద్యార్థులు వాపోతున్నారు.

ఇప్ప‌టికైనా పాఠ‌శాల విద్యాశాఖ ఈ అక్ర‌మ వ్య‌వ‌హారాల‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేసి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ ప్రిన్సిప‌ల్ జావేద్‌, ఇత‌ర ఉపాధ్యాయుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్ర‌లు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు