Wednesday, May 22, 2024

క‌విత‌కో న్యాయం.. మందికో న్యాయమా.?

తప్పక చదవండి
  • ఢల్లీ లిక్కర్‌ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత
  • కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె
  • చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్‌ నుంచి బర్తరఫ్‌
  • గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే మంత్రి పదవీ నుంచి తొలగింపు
  • రెండు నెలల నుంచి తీహార్‌ జైళ్లో ఉన్న కూతురిపై మమకారం
  • ఎమ్మెల్సీగా ఉండి సారాదందా
  • కల్వకుంట్ల ఫ్యామిలీపై గరం అవుతున్న తెలంగాణ ప్రజలు
  • స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తున్న మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు..

బీఆర్‌ఎస్‌ పార్టీలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోన్నట్టు కనిపిస్తోంది. ఏప్రిల్‌ 27, 2001 టీఆర్‌ఎస్‌ ఓ ఉద్యమ పార్టీగా స్థాపించబడిరది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కె.చంద్రశేఖర్‌ రావు పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీలో ఎందరో మేథావులు, విద్యావేత్తలు, ఉద్యోగులు, వివిధ వర్గాల వారు కలిసి పనిచేశారు. తొలి దశ ఉద్యమం కన్న మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున సాగడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అసలుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది కేసీఆర్‌, హరీశ్‌ మాత్రమే. కొత్తగా ఏర్పాడ్డ తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ పెత్తనం మొదలైంది. కొట్లాటలో మచ్చుకైనా కనిపించని కవిత, కేటీఆర్‌, సంతోష్‌ సహా మిగతావారు అందరూ పదేళ్లు రాజ్యమేలారు. ‘రానురాను రాజు గుర్రం కంచెర గాడిద’ అన్నట్టు ప్రస్తుతం ఆ పార్టీ పేరునే మార్చేశాడు అధ్యక్షుల వారు కేసీఆర్‌. పార్టీనీ దేశ వ్యాప్తంగా విస్తరిస్తానంటూ టీఆర్‌ఎస్‌ కాస్త బీఆర్‌ఎస్‌ గా పేరు మార్చారు. తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి రావడంతో కేసీఆర్‌ కళ్లు నెత్తికెక్కి భారత రాష్ట్ర సమితి (భారాస)గా నామకరణం చేసి తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా చేశారు. తదనంతరం రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి బుద్ధిచెప్పిన విషయం తెలిసిందే.

అన్యాయం చేసిర్రు:
నాడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు ఉన్న ఈటల, రాజయ్యపై కేసీఆర్‌ కఠిన చర్యలకు ఉపక్రమించాడు. తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్న చంద్రశేఖర్‌ రావు సీఎం సీటు తాను తీసుకొని డిప్యూటీ సీఎంగా ఎస్సీ (మాదిగ) రాజయ్యకు ఇచ్చాడు. అయితే ఆయనకు ఆ పదవీ మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్న డా. రాజయ్యపై వచ్చిన ఆరోపణలతో వెంటనే కేసీఆర్‌ అతడ్ని పదవీ నుంచి దించేశాడు. నేటికి రాజయ్య చేసిన స్కామ్‌ ఏందో, ఎంత పెద్ద తప్పుచేశాడో ఒక్క కేసీఆర్‌ కు తప్ప మిగతా వారికెవరికీ తెల్వకపోవడం గమనార్హం. మరోవైపు ఉద్యమంలో సుదీర్ఘంగా కొట్లాడిన ఈటల రాజేందర్‌ మొదటి గవర్నమెంట్‌ లో ఆర్థికమంత్రిగా సేవలు అందించారు. రెండోసారి ఏర్పాటైన కేసీఆర్‌ ప్రభుత్వంలో ఈటలకు మంత్రి పదవీ దక్కినప్పటికీ ఎవరో అనామకుడు ఇచ్చిన కంప్లైంట్‌ తో చంద్రశేఖర్‌ రావు క్యాబినేట్‌ నుంచి బర్తరఫ్‌ చేశారు. ఇదంతా గమనించిన ప్రజలు కేసీఆర్‌ నిజాయితీపరుడు అనుకున్నారు. ఆ తర్వాత వాళ్లపై ఏ నేరం రుజువు చేయకపోవడంతో రాజకీయ కుట్రలో భాగంగానే వారినే తొలగించాడని ప్రజలు విమర్శించారు.

- Advertisement -

బిడ్డపై చర్యలేవి:
‘నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుందన్నట్టు’ బీఆర్‌ఎస్‌ లో కల్వకుంట్ల కుటుంబం రాజ్యమేలుతుంది. పార్టీలో చిన్న చిన్న ఆరోపణలు వచ్చినందుకే పెద్ద పెద్ద లీడర్లపై చర్యలు తీసుకున్న చంద్రశేఖర్‌ రావు ఢల్లీిలో సారాదందా చేసిన బిడ్డను కడుపులో పెట్టి చూసుకుంటుండు. ఎమ్మెల్సీగా ఉన్న కవిత లిక్కర్‌ కేసులో ఇరుక్కొని తీహార్‌ జైళ్లో ఊసలు లెక్కపెడుతుంది. మద్యం వ్యాపారంలో ఈడీ, సీబీఐ విచారణ జరిపి నేరం చేసిందనీ క్లారిటీ వచ్చినందువల్లే ఆమె రెండు నెలలుగా జైలులో ఉన్నది. అయితే కేవలం ఆరోపణలు వచ్చినందుకే రాజయ్య, ఈటలను బర్తరఫ్‌ చేసిన కేసీఆర్‌, కూతురునీ కనీసం పార్టీ నుంచి సస్పెండ్‌ చేయకుండా ఉండడం వెనుక ఆంతర్యమేంటి. మందికో న్యాయం, మీకో న్యాయమా అంటూ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది.

ఉన్నత పదవులు అనుభవిస్తున్న మీరు ఇతరులకు బుద్ధిచెప్పాల్సింది పోయి మంది పెళ్లీలకు మంగళారుతులు ఇస్తున్నారు. తెలంగాణలో మీ పార్టీ మసక బారిపోతున్నప్పటికీ మీ వైఖరిలో మార్పులు రాకపోవడం సిగ్గనిపిస్తుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు అన్న చందంగా కల్వకుంట్ల కుటుంబం తీరు ఉన్నదని తెలంగాణ సమాజం తిట్టిపోసుకుంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు