Wednesday, May 22, 2024

గులాబీ కారుపై బై బై కేసీఆర్ పోస్టర్లు

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారం
  • ఒకరిపై మరొకరు మాటల తూటాలు

బయ్ బయ్ కేసీఆర్ అంటూ కారుపై బీఆర్ఎస్ ప్రభుత్వ 10 స్కాంల ప్రదర్శనతో తెలంగాణ కాంగ్రెస్ వినూత్నంగా ప్రచారం చేస్తుంది.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వివిధ రాజకీయ పార్టీలు వారివారి ప్రచారాలు మరింత జోరందుకున్నాయి. పొలిటికల్ పార్టీల మధ్య డైలాగ్ వార్స్ కూడా ఓ రేంజ్ లో పేలుతున్నాయి. అంతేకాదు.. సోషల్​ మీడియా ద్వారా ప్రజల్లోకి ప్రచారాన్ని తీసుకెళుతున్నారు. జనాల్లోకి వెళ్లేందుకు, ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఓడించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం ఉధృతం చేసింది. కేసీఆర్ తన హయాంలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం(నవంబర్ 3వ తేదీన) గాంధీభవన్ లో ‘బై బై కేసీఆర్’ ప్రచారాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు కారును అలంకరించి దానిపై ‘బై-బై కేసీఆర్’ అంటూ రాసి ఉంచారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు