Sunday, April 28, 2024

జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు ఎదురుదెబ్బ

తప్పక చదవండి
  • విచారణ అర్థ లేదన్న పిటిషన్లు కొట్టివేత
  • అలహాబాద్‌ హైకోర్టు సంచలన నిర్ణయం

అలహాబాద్‌ : వారణాసి జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు అలహాబాద్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండిరగ్‌లో ఉన్న సివిల్‌ దావా విచారణ అర్హతను సవాలు చేస్తూ వచ్చిన మొత్తం ఐదు పిటిషన్‌లపై మంగళవారం విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఆగష్టు 15, 1947కు ముందు మతపరమైన ప్రదేశాల స్వరూపాన్ని ఉనికిలో ఉన్నట్లుగా మార్చడాన్ని పరిమితం చేస్తుందని అంజుమన్‌ ఇంతేజామియా మసాజిద్‌ కమిటీ, యూపి సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డ్‌ వాదనలు వినిపించింది. కాగా మసీదులో పూజలకు అనుమతించాల్సిందిగా హిందువులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌ పై ముస్లిం సంఘాలు వేసిన పిటిషన్లపై అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. జ్ఞానవాపి మసీదు స్థానంలో గతంలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండిరగ్‌ లో ఉన్న పిటిషన్‌ కొట్టేయాలని దాఖలు చేసిన 5 పిటిషన్లను తోసిపుచ్చింది. అలాగే, ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్‌ పిటిషన్లకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంటూ, ఈ కేసుకు సంబంధించి విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ మసీదు సంఘాలు వేసిన పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. వారణాసి కోర్టులో ఉన్న పిటిషన్‌ ను ప్రార్థనా స్థలాల చట్టం 1991 నిరోధించలేదని స్పష్టం చేశారు. మొఘల్‌ కాలంలో హిందూ కాశీ విశ్వనాథ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, 2021, ఏప్రిల్‌ 8న మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్‌ డేటింగ్‌, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో చేసిన సర్వేలో ఓ శివలింగం ఆకారం బయటపడిరది. అయితే, అది శివలింగం కాదని మసీదు నిర్వాహకులు వాదిస్తున్నారు. అలాగే, సర్వేపై హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ మసీదు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అంజుమన్‌ ఇంతేజామియా మసీదు కమిటీ ంఎఓఅ, ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు అలహాబాద్‌ హైకోర్టులో 5 పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై విచారించిన ధర్మాసనం ముస్లిం సంఘాల పిటిషన్లను కొట్టేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు