Saturday, April 27, 2024

లిక్కర్ కొనుగోలను నిలిపివేసిన లిక్కర్ అసోసియేషన్

తప్పక చదవండి
  • మద్యం కొనుగోళ్లపై వాణిజ్య శాఖ అధికారుల దాడులు ఏంటి
  • జీఎస్టీ పేరుతో అధికారుల వేధింపులు ఆపాలి
  • లైసెన్సులు పొంది ప్రభుత్వానికి టాక్స్ కడుతున్న మాపై దాడులు ఏంటి
  • ఒక్క రోజే ప్రభుత్వ ఆదాయానికి వందల కోట్ల గండి
  • డిపోల వద్ద మద్యం లారీలను సీజ్ చేయడం పట్ల వ్యాపారుల ఆగ్రహం
  • లిక్కర్ వ్యాపారులపై దాడులు ఆపాలంటూ సంబంధిత శాఖకు వినతి పత్రం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరైన లిక్కర్ వ్యాపారులపై వాణిజ్య పన్నుల అధికారులు చేస్తున్న దాడులు మంచివి కావని ఇప్పటికే ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు టాక్స్లు కట్టి లైసెన్సులు పొందామని అయినా కూడా జి.ఎస్.టి పేరుతో డిపోల దగ్గర మాటు వేసి మద్యాన్ని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సీజ్ చేసిన సరుకుపై అదనంగా 20 నుండి30 లక్షల ట్యాక్స్ వేయడం ఏంటో అర్థం కాని పరిస్థితి ఉందని వారు వాపోయారు. ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాల లో మద్యం వ్యాపారంలో వచ్చే ఆదాయమే కీలకమని అది కాకుండా కమర్షియల్ టాక్స్ పేరుతో ఎన్నడూ లేని విధంగా వసూళ్లకు పాల్పడం వింతగా ఉందని దీనిని వెంటనే ఆపాలని తెలంగాణ లిక్కర్ అసోసియేషన్ అండ్ వైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా బార్స్, వైన్స్‌ షాపుల స్టాక్‌ల పై వే బిల్లులు చెల్లించాలని కమర్షియల్‌ టాక్స్‌ అధికారులు వేధిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బార్, వైన్‌ షాపుల అసోషియెషన్‌ సంఘం ప్రతినిధులు అందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎక్సైజ్‌ శాఖ కమీషనర్‌ను సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్బంగా అసోషియెషన్‌ అధ్యక్షుడు దామోదర్‌ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుంచి ఖమ్మంలో కమర్షియల్‌ టాక్స్‌ అధికారులు దాడులు చేస్తున్నారని, లిక్కర్‌ పై వే బిల్లులు అడుగుతున్నారని, లేకపోతే బార్స్,వైన్‌ షాపులకు చెందిన లిక్కర్‌ స్టాకుల వాహనాలకు సీజ్‌ చేస్తున్నారని, 20నుండి 30 లక్షల స్టాక్‌కు మళ్లీ జరిమానా విధిస్తున్నారని తెలిపారు. ఈ వే బిల్లులతో బార్లకు, వైన్స్‌ షాపులకు ఎలాంటి సంబంధం లేదని,రాష్ట్ర బేవరేజెస్‌ కార్పోరేషన్‌ ఈ స్టాక్‌కు వే బిల్లులను చెల్లిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లిక్కర్‌ మీద కేవలం జీఎస్‌టీ వసూలు చేస్తారని, ఇతర టాక్స్‌లు ఉండవన్నారు. ఇపుడు కొత్తగా కమర్షియల్‌ టాక్స్‌ అ«ధికారులు వే బిల్లులు అడగడం ఎంటో అర్ధం కావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర వైన్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కోరారు.

- Advertisement -

లిక్కర్ పాలసీలో ఏమైనా మార్పులు చేశారా అంటున్న మేధావులు
ప్రభుత్వం లిక్కర్ పాలసీలో ఏమన్నా మార్పులు చేసిందా అదనంగా కమర్షియల్ టాక్స్ వసూలు చేయడంలో కొత్తగా ఏమైనా సర్కులర్ జారీ చేశారా తెలియపరచాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని వినియోగదారులు మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పది సంవత్సరాలుగా లేని ఈ అదనపు టాక్స్ లు ఇప్పుడే ఎందుకు వసూలు చేస్తున్నారు తెలిపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఇలా చేస్తే ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా ప్రభుత్వంపై కూడా చెడు సంకేతాలు వెలబడతాయని అలాంటిది ఏమైనా ఉంటే ప్రభుత్వం వెంటనే సరి చేసుకోవాలని వారు సూచన చేశారు. గత ప్రభుత్వ తీసుకువచ్చిన లిక్కర్ పాలసీని కాదని ఇప్పుడేమైనా మార్పులు చేశారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ప్రభుత్వం సమస్యను పరిష్కరించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూసుకోవాలని సూచన చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు