Monday, April 29, 2024

కమలం కనుమరుగుకానుందా..?

తప్పక చదవండి
  • పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కేనా..?
  • రాష్ట్రంలో రోజురోజుకు పడిపోతున్న కమలం గ్రాఫ్
  • సీనియర్లంతా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపగలరా
  • పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఇన్చార్జిల నియమకం
  • పార్లమెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్
  • బీజేపీలో కనిపించని పార్లమెంట్ ఎన్నికల హడావిడి
  • గెలిచిన జోష్ లో కాంగ్రెస్, ఓడిన బాధలో బీఆర్ఎస్, బీజేపీ
  • పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో వేచి చూద్దాం

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా బీజేపీ గాలివీస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రభావం చూపలేకపోయింది. గతంలో ఎమ్మెల్యేలు గా పని చేసిన సీనియర్లంతా ఓడిపోవడం చూస్తుంటే బీజేపీ రోజురోజుకు తెలంగాణ రాష్ట్రంలో తన ఉనికిని కోల్పోతుందా అనే అనుమానం కలుగుతోంది. సీనియర్ నాయకులు హేమా ఏమిలైన ఈటల రాజేందర్, బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్, చింతల రామచంద్రారెడ్డి, రఘునందన్ రావు, తల్లోజు ఆచారి లాంటి నాయకుడు ఓడిపోవడం చూస్తుంటే అసలు బీజేపీ లో ఏం జరుగుతోంది. నాయకుల మధ్యన సమన్వయ లోపం కొట్టొచ్చినట్లుగా కనపడుతోందని పలువురి సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. నాయకత్వ లోపమేతోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయిందని రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలుగా ఎన్నో ఏళ్లుగా బీజేపీ పార్టీకి పనిచేస్తున్నామని మొన్న జరిగిన ఎన్నికల్లో సీనియర్ నాయకులు అంతా ఓటమి చెంది కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశారని బాధపడుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలగాణలో బీజేపీ పార్టీ గట్టెక్కేనా అనే అనుమానం కలుగుతోందని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో పడిపోతున్న బీజేపీ గ్రాఫ్!
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు తన ఉనికిని కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గతంలో బీజేపీ పై ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలను పట్టిపీడిస్తున్న భారత రాష్ట్ర సమితిని నిలువరించలేకపోయింది. కేసీఆర్ చేసిన రాక్షస పాలనను అడ్డుకోకపోగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే సంకేతాలను ప్రజల్ల మనసుల్లో నాటుకునేలా వ్యవహరించిందని ప్రజలు బహిరంగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత అరెస్టు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరంపై ఎన్నో ఫిర్యాదులు వచ్చిన చర్యలు చేపట్టకపోవడం కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ళుగా చేసిన అక్రమాలు అరాచకాలు దురాగతాలను పలువురు సామాజిక కార్యకర్తలు ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి అందించినప్పటికిని బీఆర్ఎస్ ప్రభుత్వం పై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టకుండా నాన్చుడు ధోరణి కనబరిచిందని, ఇంత జరుగుతున్న కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిపై మాటల వరకే పరిమితమైంది అని విమర్శించారు. వాటిపై ఎక్కడా చర్యలు చేపట్టకపోవడం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. పార్టీ అధ్యక్షుడిని మార్చడం రాష్ట్రంలో బీజేపీ పార్టీ దెబ్బతినటానికి కారణమయ్యాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నాయకులు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఓటమి తర్వాత పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, లాంటి నాయకులు ఉన్నారు. వీరితోపాటు గత 30 ఏళ్లుగా పార్టీలో ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు అందించి పార్టీ తరఫున ఇప్పటికీ ఐదు ఆరు సార్లు పోటీ చేసి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమిపాలైన నాయకుడు తల్లోజు ఆచారి కూడా ఎంపీ స్థానానికి పోటీ చేయాలని అనుకుంటున్నారు. నాయకులు ప్రజల మధ్యలో ఉండి కార్యకర్తలకు బలాన్ని ఇవ్వాలని కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడుకోవాలని అంటున్నారు. బీజేపీ పార్టీ తెలంగాణలో నిలదొక్కుకోవాలంటే నాయకులు ఏకతాటి పైకి వచ్చి విభేదాలు లేకుండా కార్యకర్తలను ప్రజలను కలుస్తూ పార్టీని ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రజల్లో ఉండి పార్టీని కాపాడాలని బిజెపి కార్యకర్తలు నాయకులను వేడుకుంటున్నారు.

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఇన్చార్జిలను నియమించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టాలనే ఆలోచనతో ముందస్తువ్యుహంగా ప్రక్రియ మొదలుపెట్టారు. ఏదేమైనా 15 ఎంపీ సీట్లను గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని కూడా రాష్ట్రంలో పోటీ చేయించాలని భావిస్తున్నట్లు ఇప్పటికే తెలిపారు. భారత రాష్ట్ర సమితి కూడా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పరువు పోయిందని ఎలాగైనా పార్లమెంట్లో అత్యధిక స్థానాలు గెలుపొంది పరువు నిలబెట్టుకోవాలని, ఆదిశగా వారు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన జోష్ లో కాంగ్రెస్పార్టీ ఉంటే ఓడిపోయిన కసితో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి.

బీజేపీలో ఎక్కడా కనపడని పార్లమెంట్ ఎన్నికల హడావిడి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఎలా ముందుకు పోతుందో చూడాలి. ఎక్కడ కూడా పార్టీలో ఆ హడావిడి కనపడడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. సీనియర్ నాయకులంతా కలిసి కట్టేకించాలని అంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధ్యక్షుడు మార్పులు జరిగితే పార్టీ గట్టెక్కే అవకాశాలు ఉంటాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ఉన్న కాంగ్రెస్ ఓడిపోయిన బిజెపి, బిఆర్ఎస్ పార్టీల్లో ఎవరు సత్తాచాటుతారో వేచి చూద్దాం!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు