Thursday, May 2, 2024

చర్చకు దారి తీసిన వసుంధర రాజే వ్యాఖ్యలు

తప్పక చదవండి

కోటా ; రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పోరాడు తుంటే, అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీపా ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలతో ఒక్కసారిగా రాజస్థాన్‌ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఎన్ని కల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. తన కుమారుడి ప్రసంగం విన్న తర్వాత ఇక విూదట తను రాజకీ యాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకోవాలని అనిపిస్తోందని వసుంధర రాజే అన్నారు. తన కుమారుడు ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ గురించి తనకు ఇక బెంగలేదన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబం ధించి శుక్రవారం ఝలావర్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ఈ విధంగా వ్యాఖ్యా నించారు. బీజేపీ ఈ సారి వసంధర రాజేను ఝలావర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఆమె ప్రసంగానికి ముందు కుమారుడు ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ ప్రసంగించారు. అనంతరం వసుంధర రాజే మాట్లాడుతూ తన కుమారుడి ప్రసంగం వింటుంటే ఇక తను రిటైర్మెంట్‌ తీసుకోవాలని అనిపిస్తోందని అన్నారు. తన కుమారుడి పట్ల ప్రజలు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశా రు. ప్రజలు తన కుమారుడిని సరైన మార్గంలోనే నడిపిస్తున్నారని అన్నారు. ఇక తన కుమారుడి గురించి చింతించాల్సిన అవసరం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వసుంధర రాజే పోటీ చేయడంపై గత కొంతకాలంగా ఊహగానాలు నెలకొన్నప్పటికీ బీజేపీ ఆమెను అభ్యర్థిగా ప్రక టించింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమెను అధిష్ఠానం ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో పార్టీలో ఆమె భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో వసుంధర రాజే ఈ వ్యాఖ్య లు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వసుంధర రాజే కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ రaలావర్‌`బరన్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 50 ఏళ్ల దుష్యంత్‌ సింగ్‌ వరుసగా నాలుగు పర్యాయాలు బీజేపీ ఎంపీగా గెలిచారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు