Wednesday, September 11, 2024
spot_img

నేపాల్‌లో భారీ భూకంపం..70 మంది మృతి

తప్పక చదవండి

కఠ్మండూ : హిమాలయ దేశం నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మెజర్‌మెంట్‌ సెంటర్‌ తెలిపింది. జాజర్‌కోట్‌ జిల్లాలోని లామిదండా ప్రాతంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడిరచింది. భూఅంతర్భాగంలో 10 కిలోవిూటర్ల లోతులో కదలికలు సంభవిం చాయని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. భూకం పం ధాటికి చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు 70 మంది మరణించారని అధికారులు వెల్లడిరచారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల్లో జాజర్‌కోట్‌ జిల్లా కు చెందినవారు 34 మంది ఉండగా, పశ్చిమ రుకుమ్‌ జిల్లాలో మరో 35 మంది ఉన్నారు. కాగా, మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ సంతాపం తెలిపారు. దేశంలోని మూడు భద్ర తా సంస్థలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని, బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తు న్నాయని చెప్పారు. దైలేఖ్‌, సల్యాన్‌, రొల్పా జిల్లాల్లో కూడా పలువురు మృతిచెం దారని, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. నేపాల్‌లో గత నెల 3న 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. మరోవైపు, నేపాల్‌లో సంభవించిన భూకం ప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ ప్రకంపణలు వచ్చా యి. 15 సెకన్లపాటు భూమి కంపించింది. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు ఢల్లీి, ఢల్లీి`ఎన్‌సీఆర్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపిం ది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. రాత్రి టీవీ చూస్తుండగా ఒక్కసారిగా భూకంపం వచ్చిందని నోయిడాకు చెందిన వారు చెప్పారు. మంచంపై పడుకొని ఉండగా అది కదలడం ప్రారంభిందని, సీలింగ్‌ ఫ్యాన్‌ కూడా కదలడం గణించానని బీహార్‌ రాజధాని పాట్నాకు చెందిన ఓ నివాసితుడు చెప్పారు. వెంటనే తాను ఇంట్లోనుంచి బయటకు వచ్చానని చెప్పారు. అసలు ఏం జరుగుతుంతో గుర్తించడానికి కొంత సమయం పట్టిందని ఢల్లీికి చెందిన ఓ మహిళ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు