Friday, May 3, 2024

ఇది చారిత్రాత్మక ఘట్టం..

తప్పక చదవండి
  • వందే భారత్‌ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి..
  • కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కార్యక్రమంలోపాలు పంచుకున్న గవర్నర్‌ తమిళి సై..
  • దేశంలో చారిత్రక, ప్రఖ్యాత 111 నగరాలను అనుసంధానం చేసే ప్రక్రియ అన్న మంత్రి..

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ మోడ్‌లో జెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. వందేభారత్‌ రైళ్ళ ప్రారంబోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని కార్యక్రమంలో పాలుపం చుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లుడుతూ.. దేశంలో చారిత్రక, ప్రఖ్యాత111 నగరాలను అనుసంధానం చేస్తూ.. ‘ఈరోజు 9 వందే భారత్‌ రైళ్లను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే రెండు వందే భారత్‌రైళ్లు వచ్చాయి. ఈ రోజు మూడో వందే భారత్‌.. హైదరాబాద్‌ బెంగళూరు రైలును ప్రధాని ప్రారంభిస్తున్నారు. వినాయక చవిత సందర్భంగా మూడో ట్రైన్‌ ప్రారంభించుకోవడం శుభపరిణాం. హైదరాబాద్‌ కేంద్రంగా మూడు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించుకోవడం గొప్ప విషయం. మూడు వందే భారత్‌ రైళ్లను ఇచ్చినందుకు ప్రధాని మోడీ గారికి, రైల్వే శాఖమంత్రి గారికి తెలుగు, తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న. ‘కాచీగూడ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు.. మూడు రాష్ట్రాలను కలుపనుంది. 12 జిల్లాలను కలుపుతూ వెళ్తుంది. రెండు ఐటీ(హైదరాబాద్‌, బెంగళూరు) రాజధానులను ఈ రైలు అనుసంధానం చేయబోతున్నది. బెంగుళూరుకు వందే భారత్‌ రైలు రాకతో ఒకే రోజు వెళ్లి రావొచ్చు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్టోబర్‌1, 3వ తేదీల్లో ప్రధాని మోడీ తెలంగాణకు రాబోతున్నారు. ఆరోజు కూడా అనేక రైల్వే ప్రాజెక్టులకు ఫౌండేషన్‌స్టోన్‌ వేయబోతున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదిన్నరేండ్లలో ఏటా 55 కిలోమీటర్ల రైల్వే లైన్‌నిర్మాణం చేపట్టారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో రైల్వే నెట్‌ వర్క్‌ తక్కువగా ఉన్నది. ఆ విషయం గ్రహించే.. ప్రధాని మోడీ అధిక రైల్వే ప్రాజెక్టులు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది రూ.4,418 కోట్ల రైల్వే బడ్జెట్‌ మోడీ ప్రభుత్వం కేటాయించిందన్నారు’. ‘2014 యూపీయే హయాంలో తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ రూపంలో రూ.258 కోట్లు ప్రవేశపెట్టారు. మోడీ గారు తెలంగాణ రైల్వేల అభివృద్ధి కోసం రూ. 4,418 కోట్లు కేటాయించారంటే.. ఎంత శాతం బడ్జెట్‌పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో 31 వేల కోట్ల రూపాయల రైల్వే పనులు నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు రూ.2300 కోట్లతో తెలంగాణలో అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ఆ మధ్య వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు 717 కోట్ల రూపాయలు కేటాయించి, ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎలా ఉంటుందో.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అలా కాబోతున్నది. నాంపల్లి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. కాచీగూడ ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం. చర్లపల్లిలో రూ. 221 కోట్ల న్యూ టెర్మినల్‌ నిర్మాణం కాబోతున్నది’.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు