- గన్ పార్టీ అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు జరిగిన ప్రదర్శన..
- పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు..
- మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటంతో వెల్లువెత్తిన ఆనందోత్సవాలు..
హైదరాబాద్ : పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయిన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు.. ఆదివారం సాయంత్రం 3 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు మహిళలతో భారీ ర్యాలీ జరిగింది.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత.. ఆ బిల్లును రాజ్యసభకు పంపారు. ఈ బిల్లుపై రాజ్యసభలో 10 గంటలకు పైగా చర్చ జరిగిన అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అను కూలంగా 215 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొం దింది.కాగా కొత్త పార్లమెంటులోని లోక్‌సభలో తొలిసారి ఆమోదం పొందిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్ కావడం విశేషం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈనెల 19న ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ చేపట్టారు. సుమారు 8 గంటల సేపు చర్చ అనంతరం దీనిపై ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది ఎంపీలు ఓటు వేయగా, ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేశారు.