Monday, April 29, 2024

ట్రాక్‌ తప్పిన ట్రాక్‌ విశ్రాంత ఉద్యోగి..

తప్పక చదవండి
  • ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్న వైనం
  • గవర్నమెంట్‌ వెహికల్‌ ను అప్పనంగా వాడుకున్న అధికారి
  • అనధికార అధికారాలను దర్జాగా అనుభవిస్తున్న ఫోర్‌ ట్వంటీ
  • మాజీ ఏడీజీ డాక్టర్‌ జీ. శ్రీనివాస రెడ్డి లీలలు అన్నీ ఇన్నీ కావు

తెలంగాణ ప్రభుత్వ ప్లానింగ్‌ డిపార్ట్మెంట్‌, తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మాజీ ఏడీజీ డా. జీ. శ్రీనివాస రెడ్డి విచ్చలవిడిగా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్నాడనే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. దీనిపై ట్రాక్‌ ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు.. ఒక గురుతర బాధ్యతలు నిర్వహించిన అధికారి, రిటైర్డ్‌ అయిన తరువాత కూడా తన కన్నింగ్‌ మెంటాలిటీని మార్చుకోలేదు.. కనకపు సింహాసనంబున శునకమును కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేల పోవు.. అన్నట్లు.. ఇతగాడి బుద్ధి మారలేదు.. కాగా ఈ అధికారి అనధికారిక పొడిగింపు, ఉద్యోగులను తప్పుదారి పట్టించడమే కాకుండా అధికారిక పత్రాలు, చెక్కులపై సంతకం చేయడానికి వీలు కల్పించి, ప్రమాదకర పరిస్థితిని సృష్టించింది. సదరు అధికారి తాను విధుల్లో ఉన్నప్పుడు.. ఆ తరువాత పదవీ విరమణ చేసిన తరువాత కూడా తన ఫందాను కొనసాగిస్తున్న వైనాన్ని మీముందుకు తీసుకుని రానుంది ఆదాబ్‌ హైదరాబాద్‌.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు