Thursday, May 16, 2024

కేబినెట్‌లోకి కోదండరాం !

తప్పక చదవండి
  • మంత్రి పదవి లేదా సమానమైన హోదా ఇచ్చే అవకాశం
  • ఆయనతో పాటు పలువురు ఆశావహులు, సీనియర్లు
  • నెలాఖరున స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం
  • లోక్ సభ ఎన్నికలకంటే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ..
  • మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం కసరత్తు

హైదరాబాద్ :- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.తన నిర్ణయాలను ఎవ్వరు వేలెత్తి చూపుకుండా.. విమర్శలకు తావే లేకుండా అన్నివిషయాల్లో ఆచీ తూచి అడుగులు వేస్తున్నారు..ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హోం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి ప్రధాన శాఖలు పెండింగ్‌లో ఉన్నాయి . ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ కసరత్తు ప్రారంభించారు. అలాగే నామినేటెడ్ పోస్టులను భర్తీ కూడా పూర్తి చేయాలనీ చూస్తున్నారు. దీనిలో భాగంగా పలువురు ప్రముఖులకు, విద్యావేత్తలకు తన క్యాబినెట్లో అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రముఖంగా వినబడుతున్న పేరు
కోదండరాం.. తెలంగాణ సమాజంలో కోదండరాం సుపరిచితమైన వ్యక్తి .. తెలంగాణ ఉద్యమంలో పార్టీలన్నింటిని ఏకతాటి ఫై తీసుకురావడమేగాక వాటన్నింటిని జేఏసీ గా ఏర్పాటుచేసి వాటికీ నాయకత్వం వహించిన ఘనత కోదండరాం దేనని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి పక్కన పెట్టింది. ఆయనకున్న విజ్ఞానం తెలంగాణ ప్రజలకు అవసరమని గ్రహించిన సీఎం ఆయనకు కీలక భాద్యతలు అప్పగించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.

కోదండరాం తో పాటు పలువురికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం
ఈ నెలాఖరులోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. . నామినేటెడ్ పోస్టులను కొన్నింటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం. ఇక మంత్రి వర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరాం కు అవకాశం ఇవ్వాలనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఒకటి కోదండరాం కు ఇప్పటికే ఖరారు అయిందని అంతా చెప్పుకుంటున్నారు..తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. దీంతో, కోదండరాం కు మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించటం ద్వారా ప్రొఫెసర్ గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు వేంకటస్వామి వివేక్ కు, మైనంపల్లి హనుమంత రావు కు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.గవర్నర్ కోటాలో ఒక స్థానాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇవ్వగా .. రెండో స్థానం ఎవ్వరికి కేటాయించాలన్నదానిపై ఇంకా కసరత్తు నడుస్తోంది . కవి రచయిత తెలంగాణ ఉద్యమకారుడు అందెశ్రీ, విద్యా సంస్థల అధినేత జాఫర్ జావేద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది . కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండగా .. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని అద్దంకి దయాకర్ కి ఇవ్వాలని నిర్ణయించారు. రెండో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. అనిల్, వేణుగోపాల్, మహేశ్ కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, కోదండరెడ్డిల మధ్య పోటీ ఉంది. ఇక మహిళల కోటాలో శారద పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం .. ఇప్పటికిప్పుడు ఈ విషయం పై క్లారీటీ రాకపోయినా నెలాఖరు వరకు ఒక క్లారీటీ వచ్చే అవకాశం ఉందంటూ గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు పలువురు సీనియర్లు కూడా మంత్రి పదవులు ఆశించే వారి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై ఇప్పటికే హైకమాండ్‌కు నివేదిక పంపారట . వారి నుంచి అనుమతి రాగానే తన తదుపరి చర్యలు సీఎం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది..

- Advertisement -

బీఆర్ఎస్ పైన నైతికంగా పై చేయి సాధించవచ్చనేది రేవంత్ వ్యూహం
కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా బీఆర్ఎస్ పైన నైతికంగా పై చేయి సాధించవచ్చనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక, మిగిలిన అయిదు మంత్రి పదవుల్లో షబ్బీర్ అలీకి ఖాయమని చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం ఇప్పటికే సోనియాను కలిసారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకం తో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావ్ కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌ పోటీలో ఉన్నా..షబ్బీర్ అలీకి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కి అవకాశాలు సన్నగిల్లుతాయి. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికి అప్పగిస్తారనేది మిలియాన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

లోక్ సభ ఎన్నికలకంటే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ..
ప్రస్తుతమున్న పరిణామాల నేపథ్యంలో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం కాంగ్రెస్ కూ సవాల్‌తో కూడుకున్న పని . అందుకే లోక్ సభ ఎన్నికలకంటే ముందే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి.. మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. తద్వారా ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవచ్చని ఆయన అంచనావేస్తున్నారట.. ప్రస్తుతం కేబినెట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాధాన్యత దక్కకపోవడంతో.. ఆయా జిల్లాలకు ప్రాధాన్యత దక్కేలా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని సీఎం అనుకుంటున్నారని తెలుస్తోంది.. .

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు