Sunday, May 12, 2024

కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ అంత చీకటి మయం

తప్పక చదవండి
  • మంత్రి నామినేషన్‌కి వేలాదిగా తరలి వచ్చిన జనం
  • 30 ఏళ్లు మూసీ మురికి నీటిని తాగించిన పాపం కాంగ్రెస్‌ది అయితే,
    విముక్తి కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌ది
  • కర్ణాటకలో కరెంట్‌ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్‌
  • నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే నా లక్ష్యం
  • సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం
  • సూర్యాపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి జగదీష్‌ రెడ్డి

సూర్యాపేట : సూర్యాపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. సూర్యాపేట ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. నామినేషన్‌ దాఖలు కంటే ముందు శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం, ఆత్మకూరు మండలంలోని నిమ్మకల్‌ దండ మైసమ్మ తల్లి ఆలయం,సూర్యాపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.సూర్యాపేట నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తరలిరాగా, మెడికల్‌ కళాశాల నుండి తాళ్లగడ్డ,కల్నల్‌ సంతోష్‌ బాబు చౌరస్తా, పూల సెంటర్‌ మీదగా ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ గా వెళ్ళారు. సూర్యాపేట పట్టణం ఎటు చూసినా గులాబీమయంగా మారింది. అడుగడుగునా ప్రజలు మంత్రి జగదీష్‌ రెడ్డి కి అపూర్వ స్వాగతం పలికారు.అనంతరం మంత్రి జగదీష్‌ రెడ్డి, వైవి, మున్సిపల్‌ చైర్మన్‌ తిరుమల అన్నపూర్ణ,గండూరి ప్రకాష్‌, జడ్పిటిసి సంజీవ నాయక్‌ తో కలిసి సూర్యాపేట ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ వేశారు.అనంతరం మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ ..ఏడు దశాబ్దాల ప్రజాస్వామ్య పాలన లో ఇచ్చిన మ్యానిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక పార్టీ దేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అని సూర్యాపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు.సూర్యాపేట ప్రజలకు 2014 ,2018 లో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చిన అన్నారు. చెప్పకున్నా మెడికల్‌ కాలేజ్‌ తీసుకువచ్చి సూర్యాపేటను మెడికల్‌ హబ్‌గా చేశాం అన్నారు. సూర్యాపేటతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా లో బీఆర్‌ఎస్‌ కు ఎదురులేదు… కేసీఆర్‌ కు తిరుగు లేదన్నారు.70 ఏళ్ల లో జరుగని అభివృద్ధి ని కేవలం 6 ఏళ్ల కాలంలో చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వం లోని బీఆర్‌ఎస్‌ పార్టీ దే అన్నారు.సూర్యాపేట లో కూడా ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్‌ పాలన ను కోరుకుంటున్నారని అన్నారు.ఈ రోజు నా నామినేషన్‌ సందర్బంగా స్వచ్చందంగా తరలివచ్చిన జన ప్రభంజనమే దీనికి తార్కాణం అన్నారు.30 ఏళ్లు మూసీ మురికి నీటిని తాగించిన పాపం కాంగ్రెస్‌ ది అయితే, విముక్తి కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌ దే అన్నారు.కాంగ్రెస్‌ కు ఓటేస్తే తెలంగాణ అందాకారం అవడం ఖాయం అన్న మంత్రి,కర్ణాటకలో కరెంట్‌ ఇవ్వలేని అసమర్థ ప్రభు త్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నారు.వచ్చే నెల 30 వ తేదీ వరకు ఇదే జోష్‌ ను కనబరిచి ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా తమ ఓటు తో సమాధానం ఇవ్వాలని మంత్రి జగదీష్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు