Friday, May 3, 2024

కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

తప్పక చదవండి
  • కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ అభిషేక్‌ మొహంతి

కరీంనగర్‌ : కరీంనగర్‌ కమీషనరేట్‌లోగల కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ను కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ అభిషేక్‌ మొహంతి గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్‌ స్టేషన్‌ లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌ లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేసారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్‌ చేయాలనీ, ఉల్లంఫీుస్తే బౌండ్‌ డౌన్‌ చేసి పూచికత్తు సొమ్ము మొత్తాన్ని జప్తు చేయాల్సి వస్తుందని మరియు జైలు శిక్షకూడా విధించబడుతుందని వారికి తెలపాలన్నారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల నియమావాళిని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిష్పక్షపాతంగా పక్కాగా అమలు పరచాలన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ రూరల్‌ ఇన్స్పెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌, ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు