Monday, May 20, 2024

కవిత అరెస్ట్ వెనుక సంతోష్ హస్తముందా..?

తప్పక చదవండి
  • తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టానిక్ మాల్స్ క‌థేంటి..?
  • రాష్ట్రంలో బీఆర్ఎస్ హ‌యాంలోనే లిక్క‌ర్ మార్ట్‌లు
  • బీజేపీ పెద్ద‌ల‌తో సంతోష్‌కు ఏమైనా ఒప్పందాలున్నాయా..?
  • క‌విత అరెస్ట్‌తో క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో క‌ల‌వ‌రం
  • బీఆర్ఎస్ పార్టీ అంత‌ర్మ‌థనానికి ముగింపు ఎప్పుడు..?

ఢిల్లీ లిక్కర్ స్కాం లో వందకోట్లు పెట్టుబడి పెట్టిందని కవితను అరెస్ట్ చేశారు! మరి అంతకంటే పెద్ద లిక్కర్ స్కామ్ ను వెనకుండి నడిపించిన సంతోష్ ని ఎందుకు వదిలేశారు? స్కామ్ లేదు గేమ్ లేదు అంత ఉత్తరే రాజకీయ కక్షతోనే నా కూతురిని మోడీ అరెస్ట్ చేయించాడని కన్నీళ్లు కారుస్తున్న కేసీఆర్ తన కొడుకు వరసైన సంతోష్ ను బీజేపీ పెద్దలు ఎందుకు వదిలేశారని తనని తాను ప్రశ్నించుకున్నారా? లేక తెలిసే ఏమిచేయలేని పరిస్థితిలో నోరువిప్పడం లేదా? అసలు సంతోష్ చేసిన పనేమిటీ..! కేసీఆర్ వెన్నంటి ఉంటూనే కుటుంబాన్ని ఇబ్బంది పెట్టె కార్యాచరణలో ఉన్నాదా? స్వప్రయోజనాల కోసమో.. అవినీతి దందాలలో కేసుల భారిన పడకుండా ఉండటం కోసమో.. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం కోసమో… కేసీఆర్ కుటుంబ సభ్యులను ఇరుకున పడేలా చేస్తున్నాదా! అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివే!

కవిత అరెస్ట్, అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. నమ్మకంగా వెంట బెట్టుకున్న కేసీఆర్ ను నట్టెట్ట ముంచడమే లక్ష్యంగా సంతోష్ పావులు కదుపుతున్నట్లుగా పరిణామాలు స్పష్టతను ఇస్తున్నాయి. అసలు సంతోష్ లక్ష్యమేమిటి, రాజకీయంగా తన ఎదుగుదలకు కేటీఆర్, కవిత, హరీష్ రావు అడ్డుగా ఉన్నారని బావించాడా! వారిని అడ్డులేకుండా చేసుకోవడానికే లోపాయికారిగా బీజేపీ తో చేతులు కలిపాడా! అనే అనుమానాలు ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో వ్యక్తమవుతున్నాయి!

- Advertisement -

ఐదేళ్ల క్రితం మాట..! చాలా మంది పార్టీలోని సీనియర్లు, ఇతర పార్టీలనుండి బీఆర్ఎస్ లో చేరిన కీలక నేతలకు సంతోష్ ను కేసీఆర్ వెన్నంటి ఉంచుకోవడం నచ్చేది కాదు! సంతోష్ ముందు కేసీఆర్ తమతో అత్యంత ముఖ్యమైన విషయాలు చర్చించడం వారికి నచ్చేది కాదు! అయితే కేసీఆర్ కు చెప్పలేక చాలామంది మిన్నకుండి పోయారు. ఒకరిద్దరు ముఖ్య నేతలు మాత్రం సంతోష్ ని కొన్ని విషయాల్లో దూరంగా ఉంచాలని కేసీఆర్ కే నేరుగా చెప్పేసారు. అయితే కేసీఆర్ వారు చెప్పినదాన్ని పెడచెవిన పెట్టారు. అయితే ఈ విషయం సంతోష్ కు తెలిసింది! ఇక అంతే… సంతోష్ సదరు నేతలను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేశాడు! అంతే కాదు! వారిని కేసీఆర్ నుండి పూర్తిగా దూరం చేసేసాడు! కేసీఆర్ కుటుంబసభ్యుల కదలికలపై కూడా సంతోష్ నిఘా పెట్టించాడు! పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్, కవిత, హరీష్ రావు వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సంతోష్ ఒక ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్నే నడిపించాడనేది బహిరంగ రహస్యమే! తమపై సంతోష్ నిఘా పెట్టిన విషయం గ్రహించిన కవిత, కేటీఆర్ తండ్రికి చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ అదంతా ఉత్తదే అన్నట్లుగా కేసీఆర్ తేలికగా కొట్టిపారేశారని, సంతోష్ పై ఆయన చాలా విశ్వాసం ఉచేవారనేది పార్టీ ముఖ్యనేతలు చెప్పేవారు!.

లీక్సర్ స్కామ్తో ఒక్కసారిగా ఉలిక్కి పడిన కేసీఆర్!
ఏడాదిన్నర క్రితం కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చే వరకు సంతోష్ ను కేసీఆర్ పూర్తిగా నమ్మేవాడు. ఎవరేం చెప్పిన వినేవాడు కాదు! ఢిల్లీలో కీలక వ్యవహారాలన్నీ సంతోష్ చేతుల్లోనే పెట్టేసాడు! అలాంటిది కవిత పేరు లిక్కర్ స్కామ్ లో బయటకు రాగానే జేసీఆర్ ఉలిక్కి పడ్డాడు! ఢిల్లీలో అత్యంత కీలకంగా రాజకీయ వ్యవహార నడిపించిన సంతోష్ కు లిక్కర్ స్కామ్ గురించి ముందే తెలియదా అన్న అనుమానాలు కేసీఆర్ లో మొదలయ్యాయి! తెలిసే కావాలనే గోప్యంగా ఉంచాడా అని అనుమానం వచ్చింది! దీంతో కేసీఆర్ మెల్లిగా సంతోష్ ను దూరం పెట్టడం మొదలెట్టాడు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న అత్యంత కీలక సమయంలో సంతోష్ ని కేసీఆర్ దూరం పెట్టడం పార్టీ శ్రేణుల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది! ఇదిలా ఉండగానే అసెంబ్లీ, ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం, కేసీఆర్ జారిపడి అనారోగ్యానికి గురవ్వడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా అశక్తుడిగా మారిపోయిన జేసీఆర్ ఎవరిని ఏమీ అనలేని దయనీయ స్థితిలోకి పడిపోయాడు. అదే సరైన సమయంగా భావించిన సంతోష్.. మళ్ళీ వచ్చి కేసీఆర్ వద్ద మెల్లిగా చేరిపోయాడు. సంతోష్ గురించి అన్ని తెలిసినా.. అతన్ని ఏమి చేయలేని దీనావస్థలో కేసీఆర్ ఉన్నట్లుగా సొంత పార్టీ నేతలకు సహా అందరికీ అనిపించింది. ఈలోగా కవిత అరెస్ట్ శరాఘాతంలా కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడింది. అసలే అధికారం కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన కేసీఆర్ కుటుంబ సభ్యులను కవిత అరెస్ట్ మరింత సంక్షోభంలోకి నెట్టేసింది, ఎవరినీ ఎవరు రక్షించలేని స్థితిలో కేసీఆర్ కుటుంబసభ్యులు పడిపోయారు. ఒక వైపు సంక్షోభం నుండి ఎలా బయట పదాలో తెలియకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత సహా ఇతర కుటుంబ సభ్యులు సతమతమౌతుంటే.. సంతోష్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండడం అందరిని విస్మయ వరుస్తోంది. కవిత అరెస్ట్ కీహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉండి దాదాపు యాభై రోజులు కావస్తున్నా… సంతోష్ మాత్రం జైలుకు వెళ్లి కనీసం పలకరించిన పాపాన పోలేదు. ఓవైపు కేటీఆర్, కవిత కుటుంబం, హరీష్ రావు తీహార్ జైలుకు వెళ్లి కవితను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నా.. సంతోష్ మాత్రం అటువైపు చూడటంలేదు! అసలు కవిత ఆరెస్ట్ అయినా నాటి నుండి సంతోష్ ఢిల్లీ కి వెళ్లడమే మానేసాడు!. రాజ్యసభ సభ్యుడిగా మొన్నటి వరకు ఢిల్లీ లో చక్రం తిప్పిన సంతోష్ ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్లడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కవితను బిక్కర్ స్కామ్ లో ఇరికించింది సంతోషేనా… అని అనిపించేలా ఆయన వ్యవహారం ఉంది! టీఆర్ఎస్ ను స్థాపించింది కేసీఆర్, పార్టీలో సంతోష్ ను చేర్చుకుంది కేసీఆర్. పక్కన బెట్టుకుని అన్ని విధాలా ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్, రాజ్యసభ సభ్యుడిని చేసింది కేసీఆర్! అలాంటి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటే సంతోష్ ఎందుకు పట్టించుకోవడం లేదు! కవితను విడిపించడానికి కాదు కదా అసలు ఆమెను కలపడానికి కూడా ఎందుకు ఇష్టపడటం లేదు! అధికారంలో ఉన్నపుడు నెంబర్ 2 గా వ్యవహరిస్తూ ఐపీఎస్, ఐఏఎస్, రెవెన్యూ అధికారులను కనుసైగతో నడిపిస్తూ కమీషన్లు, సెటిల్మెంట్లు, రియల్ దందాలతో వేలకోట్లు కూడగట్టిన సంతోష్ ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఇవన్నీ జవాబులేని ప్రశ్నలేమి కాదు! సంతోష్ వ్యవహారాన్ని ఆదినుండి అనుమానిస్తున్న బీఆర్ఎస్ ముఖ్యనేతలు, శ్రేణులు. ఇవుడు అతనిపై అంతర్గత చర్చల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు! అన్ని అనర్ధాలకి సంతోనే కారణమని మండి పడుతున్నారు. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల హడావుడి కొనసాగుతుండటం.. బాహాటంగా సంతోష్ ను విమర్శిస్తే తమకి
భవిష్యత్తులో నష్టం కలుగుతుందేమో అన్న ఆలోచనతో సైలెంట్ గా ఉండిపోతున్నారని తెలుస్తోంది! టానిక్ స్కామ్ అని తెలిసినా బీజేపీ పెద్దలు వదిలేశారా?

కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ, సిబిఐ అరెస్ట్ చేసాయి. గత నెల 15 న ఢిల్లీ ఈడీ అధికారులు
హైదరాబాద్ లోని ఆమె నివాసంలోనే కవిత ను అరెస్ట్ చేసి ఢిల్లీ కి తరలించారు. ఆ తర్వాత ఇదే స్కామ్ లో సిబిఐ కూడా మరోసారి తీహార్ జైలు లో కవితను విచారించి జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కవిత ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం మీద అటు ఈడీ ఇటు సిబిఐ కవితను అరెస్ట్ చేసినట్లుగా భావించాలి. ఇక టానిక్ విషయానికి వస్తే అదొక పెద్ద స్కామ్ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక విచారణ చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండా టానిక్ పేరుతో కార్పొరేట్ మద్యం దుకాణాలు నడిపించిన యాజమాన్యం.. విదేశీ ఖరీదైన మద్యాన్ని యథేచ్ఛగా విక్రయిస్తూ లాభాలు గడించడమే కాకుండా వంద కోట్లకు పైగా జీఎస్టీ ని ఎగవేసినట్లు గా గుర్తించారు. అంతే కాదు పొరుగున ఉన్న మహారాష్ట్ర లో కూడా తమ దుకాణాలను విస్తరించినట్లుగా గుర్తించారు. మహారాష్ట్ర పూణే నగరంలో టానిక్ వైన్ షాప్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అయినపుడు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు 2017 లో ప్రభుత్వ స్పెషల్ జీ.ఓ ద్వారా కార్పొరేట్ మద్యం దుకాణాన్ని తెరిచి.. పన్నులు చెల్లించకుండా యథేచ్చగా అక్రమాలకు పాల్పడిన టానిక్ ది స్కామ్ అని బీజేపీ పెద్దలు భావించలేదా? ఎందుకు కవితను మాత్రమే టార్గెట్ చేశారు? రెండు మధ్యానికి సంబందించిన కుంభకోణాలే కదా! రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవే కదా! అక్కడ కేజీవాల్ ప్రభుత్వం రూపొందించిన పాలసీ తప్పు అయితే… ఇక్కడ ప్రత్యేక జీవోతో నాటి కేసీఆర్ ప్రభుత్వం అనుమతిచ్చిన మద్యం వ్యాపారమే కదా! కేవలం టానిక్ వెనుక ఉన్నది సంతోష్ అని పట్టించుకోకుండా పదిలేశారా! అవే అనుమానాలు అందరినుండి వ్యక్తమవుతున్నాయి, బీజేపీ నేతృత్వంలో పిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహారాష్ట్రకు విస్తరించడానికి ఎవరు సహకరించారు. బీజేపీ పెద్దల ఆశీస్సులు లేకుండానే టానిక్

అక్కడ విస్తరించడం సాధ్యమా?
కవిత అప్రూవర్ గా
మారితే నష్టమేనా!
లిక్కర్ స్కామ్ లో కవితను ఇరికించింది సంతోషేనా అనే అనుమానాలు బలపడుతున్న వేళ అసలు ఆమె అప్రూవర్ గా మారితే సంతోష్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తి కరంగా మారింది. లిక్కర్ స్కామ్ లో తీహార్ జైలు లో జ్యుడిషియల్ కస్టడీ లో ఉన్న కవిత నోరు విప్పితే సంతోష్ కే ఎక్కువ నష్టమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఢిల్లీలో కీలకంగా వ్యవహరించిన సంతోష్ ప్రమేయంలేకుండానే ఢిల్లీ లిక్కర్ పాలసీ లో కవిత పెట్టుబడి పెట్టిందా! అసలు కవిత చేత పెట్టుబడి పెట్టించాలని ప్రోత్సహించింది ఎవరు అనే ప్రశ్నలూ ఉత్పన్నమౌతున్నాయి. ఒక వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయించిన పెద్దలు అంత కంటే ముందు నుండే లిక్కర్ వ్యాపారాన్ని పరోక్షంగా నిర్వహిస్తున్న సంతోష్ ని ఎందుకు వదిలేశారు! కవిత ఆప్రూవర్ గా మారితే సంతోష్ కు కష్టాలు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు