Monday, May 20, 2024

ఓట్ల పండుగ‌లో సాధువులు

తప్పక చదవండి

(చదువుకున్నళ్లో కన్నులు తెరిపిస్తున్న సాధువులు)

  • ప్రపంచానికి దూరం ఉన్నా టైంకు ఓటు వేసిన సాధువులు
  • పార్లమెంట్ ఎన్నికల్లో తమ బాధ్యత నెరవేర్చుకున్న వైనం
  • గ్రామీణ ప్రాంతాల్లో కన్న పట్టణాల్లో తగ్గుతున్న ఓటింగ్ శాతం
  • ఇకనైన సామాన్య పౌరులు ఓటు వేస్తారా..?

ప్రజాసామ్యంలో ఓటు హక్కు విలువ ఎంతో తెలిసి కూడా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయని గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ‘చదువుకున్నోడికి కన్నా అవతలోడు మేలు’ అన్నట్టు మారుమూల ప్రాంతాల్లో ఉండే ముసలవ్వ ఉన్న జ్ఞానం డిగ్రీలు చదవినోళ్లకు లేకపాయే. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం ప్రతిసారి ప్రచారం చేస్తూనే ఉంటుంది. లోక్ సభ ఎలక్షన్స్ లో కూడా ప్రయత్నిస్తుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. ఇంకా నాలుగు విడతల్లో ఓట్లు జరగాల్సి ఉన్నాయి. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో సాధువులు ఓటేసి తమ బాధ్యతను నెరవేర్చారు. సినిమా రిలీజ్ అయిన తొలిరోజు మొదటి షో చూసేందుకు థియోటర్ల ముందు క్యూ కట్టినట్టు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓ గంటపాటు లైనులో నిల్చుని ఓటువేసే ఇంగిత జ్ఞానం లేదు చాలామందికి. నేడు యువత మరీ బద్ధకంగా తయారయ్యారు.

- Advertisement -

ఆ నాయకుడు ఇలా.. ఈ నాయకుడు అలా అంటూ వాళ్ల చరిత్రను బట్టలు విప్పి మరీ చెప్పే మోతెబరులు.. వాళ్లగురించి మాట్లాడే ముందు, తమకు అన్యాయం జరిగిందనీ ప్రశ్నించేందుకు నోరు ఎలా వస్తుంది. ప్రపంచానికి దూరంగా ఉండే సాధువులు పనిగట్టుకొని వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చుని మరీ పోలింగ్ లో పాల్గొన్నారు. ‘పండిత పుత్ర పరమ శుంఠ’ అన్నట్టుగా ఉన్నత ఉద్యోగాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే మేధావులు ఓటింగ్ లో పాల్గొనక పోవడంతో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండే వారు వరుస సెలవులు వచ్చినయిని టూర్లు, విహార యాత్రలు, చుట్టపు చూపులకు వెళ్తూ ఎంజాయ్ చేసి వస్తున్నరు. ఓటు హక్కు తమ బాధ్యత అనేది మరిచిపోతున్నరు. రేపో, మాపో చచ్చిపోయే వందేళ్ల ముసలవ్వ, ముసలయ్య, సాధువులే వచ్చి ఓటు వేసి పోతున్నరు కాబట్టి అన్ని మంచిగ ఉన్న యువత ఈ సారి అయినా పోలింగ్ బూత్ కు రావాలని.. వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మేధావులు కోరుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు