- ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
- ఢల్లీిలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా
- జగిత్యాల సభలో రాహుల్ ఆవేశపూరిత ప్రసంగం
హైదరాబాద్ : బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఫైరయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రజా తెలంగాణ కోరుకుంటే..దొరల తెలంగాణ వచ్చిందని విమర్శించారు. ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఢల్లీిలో మీకోసం పోరాడడానికి తాను సైనికుడిగా ఉంటానని రాహుల్ గాంధీ అన్నారు. జగిత్యాల కార్నర్ మీటింగ్‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని.. తాను ఉంటున్న ఇల్లు తీసుకున్నారని మండిపడ్డారు. మీ ఇల్లు అవసరం లేదు తీసుకోండి.. దేశమంతా తన ఇల్లే అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ని తెర్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే..బలహీనవర్గాల కులగణన చేపడతామని స్పష్టం చేశారు. కులగణన అనేది దేశానికి ఎక్స్‌రే లాంటిదన్నారు రాహుల్ గాంధీ.తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ఈ క్యాస్ట్ సెన్సస్‌తోనే పూడుస్తామని జగిత్యాల సభలో ప్రామిస్ చేశారు రాహుల్ గాంధీ . రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరీ బస్సు యాత్ర మూడో రోజు మరింత జోష్‌తో సాగింది. జగిత్యాలలో యాత్రలో పాల్గొన్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. ఈసారి దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలని పునరుద్ఘాటించారు. తెలంగాణకు కేసీఆర్ నియంతలా, రాజులా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామన్నారు. ఈ క్రమంలోనే ప్రజలతో తమ పార్టీకి ఉన్న ప్రేమానుబంధాలు దశాబ్దాల నాటివని ఆయన పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ల కాలం నుంచి ప్రజలతో తమకు మంచి అనుబంధం ఉందని రాహుల్ తెలిపారు. ఇక్కడితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ విజయభేరీ బస్సు యాత్ర ముగిసింది. కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగింది. నిజామాబాద్ జిల్లాలో రాహుల్ విజయభేరీ యాత్ర ప్రవేశించింది. రాహుల్ యాత్రకు ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. కాగా.. జగిత్యాల, కొండగట్టులో రాహుల్ గాంధీ బస్సు యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది.ప్రజలతో మమేకమవుతూ రాహుల్ గాంధీ కొండగట్టు పట్టణంలో రోడ్డు పక్క తోపుడు బండిపై దోశలు కాల్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ గాంధీ వెంట ఉన్నారు. అలాగే మసాలా దోశ తింటూ అక్కడి వారితో రాహుల్ ముచ్చటించారు. రాహుల్ గాంధీ రోడ్డు పక్క తోపుడు బండిపై మసాలా దోశ కాల్చడం ఆసక్తికరంగా మారింది. దీన్ని తమ కెమరాల్లో బంధించేందుకు మీడియా ప్రతినిధులు పోటీపడ్డారు. అనంతరం జగిత్యాలలో కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కొండగట్టు పట్టణంలో మసాలా దోశ కాల్చిన రాహుల్ గాంధీ.. రామప్ప ఆలయాన్ని దర్శించుకుని తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా రామప్ప ఆలయాన్ని బుధవారంనాటు దర్శించుకున్నారు. అనంతరం ములుగులో జరిగిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్దపల్లి, కరీంనగర్‌లో నిర్వహించిన సభల్లో గురువారంనాడు పాల్గొన్నారు. తెలంగాణకు వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందని, ఈ ప్రాంతంతో తన అనుబంధం కుటుంబంతో ఉన్నటువంటిదని రాహుల్ గాంధీ పెద్దపల్లి విజయభేరీ సభలో అన్నారు. అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని రాహుల్ గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.కాంగ్రెస్ సునామీలో ప్రత్యర్థులు కొట్టుకుపోతారంటున్నారు రాహుల్‌గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని ధీమాగా చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామంటున్నారు రాహుల్. ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కరీంనగర్‌లో పాదయాత్ర చేపట్టారు. పార్టీ శ్రేణులు ఆయన వెంట నడిచారు. ఆ తర్వాత కరీంనగర్ రాజీవ్ చౌక్‌లో బస్సు పైనుంచి మాట్లాడారు. %దీRూ-దీజీూ%- మజ్లిస్ పరస్పరం సహకరించుకుంటాయని రాహుల్ అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను, ఢల్లీిలో బీజేపీని గద్దె దించాలని రాహుల్ పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతోంది. అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ నెలకొంటోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.