Friday, May 3, 2024

నేడు మిషన్‌ గగన్‌యాన్‌ ప్రయోగానికి శ్రీకారం

తప్పక చదవండి

నెల్లూరు : ఇస్రో తొలిసారిగా మానవ సహిత ప్రయోగానికి ఇప్పటికే సిద్ధం అయ్యింది.. ఇప్పటికే చంద్రయాన్‌ 2 తో ఫుల్‌ జోష్‌ లో ఉన్న శాస్త్ర వేత్తలు గగన్‌ యాన్‌ పేరుతో అంత రోక్షంలోకి మానవ సహిత ప్రయోగంలో భాగమైన గగన్‌ యాన్‌ ప్రయోగానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది..ఈనెల 21 న ఉదయం ఏడు గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్ర వేత్తలు సిద్ధమయ్యారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవిష్యత్తులో చేపట్టనున్న గగన్‌ యాన్‌ ప్రాజెక్టుకి సంబంధించి మానవ సహిత ప్రయోగాలు నిర్వహించేందుకు ఈనెల 21న ఒక ప్రయోగాత్మక ప్రయోగానికి శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా టెక్నికల్‌ వెహికల్‌- డెమోన్‌ స్ట్రేషన్‌-1 (%ుప-ణ%1)అనే పేరుతో ఈనెల 21న ఉదయం 7 గంటలకు ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించేందుకు సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ లోని మొదటి రాకెట్‌ ప్రయోగ వేదికను సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ద్వారా క్రూ మాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం సిస్టం (వ్యోమగాములగది) భూమికి 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి బిప్యారాచూట్ల సహాయంతో తిరిగి భూమికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్రూమాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం అంతరిక్షంలోకి పంపించి సురక్షితంగా తీసుకువచ్చేందుకు బంగాళాఖాతంలో దించి అక్కడినుంచి ఒక ప్రత్యేక స్టీమర్‌ ఏర్పాటు చేసి సేవ్‌ చేసే కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలు చేసేందుకు ఇది సోపానం అవుతుందని ఇస్రో ఛైర్మన్‌ ఇప్పటికే ప్రకటించారు. గగన్‌ యాన్‌ లో కీలకమైనది క్రూ మాడ్యూల్‌.. వ్యోమగాములు అంతరిక్షంలోకో వెళ్ళేది, తిరిగి భూమిమీదకు వచ్చేది ఈ క్రూ మాడ్యూల్‌ నుంచే. కేరళ నుంచి క్రూ మాడ్యూల్‌ ను ఇప్పటికే శ్రీహరికోట తీసుకువచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు