Wednesday, May 8, 2024

మూడవ రోజు కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం…

తప్పక చదవండి
  • నాయకుడిగా కాదు. సేవకుడిగా పని చేస్తా..!

జనగామ : బి ఆర్ ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి నిరంతరం చేస్తామని జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పలు గ్రామాలు మరిగడి, చీటాకోడురు, చౌడారం, జనగామ పట్టణంలో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మూడవ రోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించారని అన్నారు. అదే విధంగా సొంత రాష్ట్రంలో ప్రజలు కష్టనష్టాలకు గురికాకుండా అభివృద్ధి ధ్యేయంగా భావించి ఇప్పటివరకు లక్ష 25 వేల మందికి రైతు బీమా ఇచ్చారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , కెసిఆర్ కిట్ అభివృద్ధిలో భాగమని అన్నారు. భూమి ఉన్నవారికి రైతు బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తున్నామని అన్నారు. 24 గంటల కరెంటు, త్రాగునీరు సాగునీరు పుష్కలంగా ఇచ్చిందని అన్నారు. 22 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నుంచి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి చేసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు మూడు గంటలు కరెంటు సరఫరా సరిపోద్దని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరమని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పది నుంచి పదిహేను రోజులలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్న ఘనత కెసిఆర్ అని అన్నారు. అలాగే మండలంలోని గ్రామాలలో షెడ్యూల్ కులాలకు వెనుకబడిన తరగతుల వారికి కమ్యూనిటీ భవనాలను మంజూరు చేస్తానని అన్నారు. అలాగే పల్లె దావఖానాలను ఏర్పాటు చేస్తానని అన్నారు. రానున్న రోజులలో భూమి లేని వారికి కెసిఆర్ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు