Monday, April 29, 2024

నమో ఛాయిస్‌ తెలంగాణ..?

తప్పక చదవండి
  • పోటీకి మోడీకి ఆసక్తి
  • లోక్‌ సభా స్థానమేదనే దానిపై రాని స్పష్టత
  • కరీంనగర్‌, నిజామాబాద్‌, పాలమూరు, మల్కాజ్‌గిరిలపై నజర్‌..?
  • ఢిల్లీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా చర్చ
  • తెలంగాణ నుంచి బరిలో దిగితే ఏపీ..?
  • కర్నాటకలోనూ కలిస్తోందనే అంచనాలో బీజేపీ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో డేరింగ్‌ స్టెప్‌ తీసుకోబోతున్నట్లు సమాచారం. నమో ఈసారి తెలంగాణ నుంచే బరిలో దిగాలనే యోచనలో ఉన్నట్లు ఢిల్లీ పొలిటికల్‌ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సౌత్‌ లో కర్నాటక తర్వాత కాస్తో కూస్తో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. అందుకే గతంలో బండి నేతృత్వంలో టీబీజేపీ తెలంగాణలో కాస్తా దూకుడుగానే వ్యవహరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఊవిళ్లూరింది. కానీ, కర్నాటకలో కాంగ్రెస్‌ కు అనుకూల పవనాలు వీయడం..అక్కడ ఆ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం ఆ ప్రభావం తెలంగాణపై పడడంతో బీజేపీ దూకుడు కాస్తా తగ్గినట్లైంది. ఈనేపథ్యంలోనే రాబోయే లోక్‌ సభ ఎన్నికల నాటికి సౌత్‌ లోని కర్నాటక, తెలంగాణతో పాటు ఏపీలోనూ తమ ప్రభావం చూపించాలని బీజేపీ అధినాయకత్వం గట్టి పట్టుదలతో ఉందనే ప్రచారముంది. అందులో భాగంగానే ఈసారి జరగనున్న లోక్‌ సభ సార్వత్రిక ఎన్నికల్లో మోడీ తెలంగాణ నుంచే బరిలో దిగొచ్చనే చర్చ ఢల్లీి పొలిటికల్‌ వర్గాల్లో సాగుతోంది. రాష్ట్రం నుంచి నమో బరిలో ఉంటే ఆ ప్రభావం కర్నాటకతో పాటు ఏపీలోనూ ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. మోడీని తెలంగాణ నుంచి పోటీ చేయించడం ద్వారా సౌత్‌ లో పార్టీకి మంచి పట్టున్న మన రాష్ట్రంతో పాటు, కర్నాటకలోనూ భాజపాకు ఒక రకమైన వేవ్‌ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అభిప్రాయంలో కాషాయ నేతలున్నారు. అందుకే ఈసారి కావాలనే మోడీ తెలంగాణను తన ఫస్ట్‌ ఛాయిస్‌ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కర్నాటకకు సరిహద్దున గల నిజామాబాద్‌, పాలమూరు సెగ్మెంట్ల నుంచి కానీ.. కరీంనగర్‌ లేదా మల్కాజ్‌ గిరి నుంచి కానీ మోడీ పోటీ చేయొచ్చనే డిస్కషన్‌ హస్తిన రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు