Monday, April 29, 2024

ఉప్పల్‌లో కారుతో కమలం ములాఖత్‌..?

తప్పక చదవండి
  • అర్దరాత్రి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కలిసిన బీజేపీ నేత..?
  • ఎలాగైనా పరమేశ్వర్‌ రెడ్డిని ఓడించాలని పన్నాగం..
  • విలువల వలువలు విప్పేసిన సోకాల్డ్‌ లీడర్స్‌..
  • నియోజకవర్గంలో అనుకుంటున్నట్లుగానే ఇద్దరు అభ్యర్థులు ఒక్కటేనా..?
  • విలువలకు పట్టం కట్టే బీజేపీ అభ్యర్థి అసలు స్వరూపం..
  • కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి సర్వ శక్తులు ఒడ్డుతున్న వైనం..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాస్తో కూస్తో విలువలు, సంస్కృతి మేళవించిన పార్టీ ఏదైనా వుంది అంటే అది బీజేపీ మాత్రమే.. సుశిక్షితులైన ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఆధారంగా.. హిందుత్వ నినాదాన్ని నెత్తికెత్తుకుని.. కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన పార్టీ బీజేపీ అని చెప్పుకోవచ్చు.. కానీ విలువలను తాకట్టుపెట్టే కుహనా నాయకులు ఇప్పుడు బీజేపీలో రాజ్యమేలుతున్నారు.. పార్టీ నైతికతను పణంగా పెడుతూ అధికార పార్టీ అయినా బీఆర్‌ఎస్‌ పార్టీ పక్కన చేరి విలువల విలువలను తొలగిస్తూ.. పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు.. ఇప్పుడు ఉప్పల్‌ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.. మరి కొన్ని గంటల్లో 2023 సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్నాయి.. ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య పోటీ నెలకొని ఉంది.. ఈ నేపథ్యంలో ఎవరికీ వారు తమ గెలు పు ఖాయమంటూ డాంబికాలు పలుకుతున్నాయి.. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయభేరి మ్రోగించి.. అధికారం సొంతం చేసు కుంది.. అదే హవా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విసిగి వేసారిపో యిన తెలంగాణ ప్రజానీకం.. మార్పు కోరుకుంటున్నా రన్న ది స్పష్టంగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలనే కొత్త నిశ్చయానికి ప్రజలు వచ్చినట్లు తెలు స్తోంది.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా దైర్యం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. ఈసారి ఎలాగైనా ఆమె ఋణం తీర్చుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.. ఆ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ వైపు విజయ పవనాలు వీస్తున్నాయి.. అయితే దక్షిణాదిలో పట్టు కోల్పోతున్నామని భావించిన బీజేపీ ఎలాగైనా మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెసును ఓడిరచాలనే పావులు కలుపుతోంది.. ఈ క్రమంలోనే ప్రధానితో సహా పలువురు జాతీయ నేతలు సుడిగాలి పర్యటన చేశారు.. వీరికి ధీటుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన నేతలు కూడా తెలంగాణ వ్యాప్తంగా పర్యటిం చారు.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినా పర్వా లేదు.. కానీ కాంగ్రెస్‌ మాత్రం అధికార పీఠం అధిరోహిం చరాదనే వారి భావన అన్నది స్పష్టమవుతోంది.. ఈ విష యాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించారన్నది అక్షర సత్యం.. అయితే ఉప్పల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్య ర్థి ఎం. పరమేశ్వర్‌ రెడ్డిని ఎలాగైనా ఓడిరచాలని కంక ణం కట్టుకున్న బీజేపీ అభ్యర్థి తాజాగా నిన్నటి రాత్రి పొద్దు పోయాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థితో రహస్య మంతనాలు జరిపిన ట్లు సమాచారం అందుతోంది..
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం తాను అన్నివిధాలా సహకరిస్తానని మాట కూడా ఇచ్చినట్లు.. రాజకీయ వర్గాల్లో గుసగుస లాడుతున్నాయి.. తన తలను బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాళ్ళ దగ్గర ఉంచిన బీజేపీ అభ్యర్థి మానవత్వపు విలువలను తాకట్టు పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు… ఏది ఏమైనా కాంగ్రెస్‌ అభ్యర్థి పరమేశ్వర్‌ రెడ్డిని ఓడిర చడానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటై కుట్రలు చేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. కానీ ఉప్పల్‌ నియోజ కవర్గ ప్రజలు అంత బుద్ధి హీనులు కాదని.. ఆలోచించి ఓటేస్తారని.. తనను తప్పకుండా గెలిపిస్తారని.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పి కొడతారని కాంగ్రెస్‌ అభ్యర్థి ఘంటాపథంగా చెబుతున్నారు.. చూద్దాం రేపు జరుగబోయే పోలింగ్‌ లో ఉప్పల్‌ నియోజకవర్గ ప్రజలు ఏ గుర్తుపై తమ వేళ్ళను కదిలిస్తారు అన్నది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు