Sunday, May 5, 2024

సుదీర్ఘ అవినీతి సుధీర్‌ రెడ్డి సొంతం..?

తప్పక చదవండి
  • సుధీర్‌ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు..
  • సాధారణ కార్పొరేటర్‌ స్థాయి నుంచి కార్పొరేట్‌ లెవల్‌కి..
  • దర్జాగా కబ్జాలు.. దౌర్జన్యాలు.. అడిగితే నిర్బంధనలు..
  • మోముపై చిరునవ్వు.. ఆ నవ్వు వెనుక కుతంత్రాలు..
  • మారుతి 800 నుంచి రోల్స్‌ రాయల్‌ కారులో తిరిగేంత స్థాయికి ఎదిగిన సుధీర్‌..
  • పేదలపై మాటల వరకే ప్రేమ..పెద్దలతో కలిసి అవినీతి దందాలు..
  • రూ. 20,000 కోట్లు దోచుకున్నాడని ఆరోపిస్తున్న ఎల్బీ నగర్‌ నియోజకవర్గ ప్రజలు.?
  • స్థానిక ఎమ్మెల్యేపై వెల్లువెత్తుతున్న ప్రజా నిరసన గళం..

హైదరాబాద్‌(ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెల్లటి మెరిసిపోయే దుస్తులు.. అంతకంటే మెరిసే చిరుదరహాసం.. ఆప్యాయంగా పలకరించడం.. పేర్లతో సహా గుర్తుపెట్టుకుని భుజాలపై చేతులు వేస్తూ మాట్లాడటం.. నిజంగా ఆయన వున్నాడులే మనకేమీ కాదులే.. మన కష్టాలు తీరతాయిలే.. అన్న ధైర్యం మనసంతా నిండిపోవడం.. నిజమైన నాయకుడు అంటే ఆయనే అనేలా భ్రమపడటం.. ఇదే ప్రస్తుతం ఎల్‌.బీ. నగర్‌ నియోజక వర్గ ప్రజల పరిస్థితి.. కానీ ఆ నవ్వు వెనకాల విషం చిమ్మే మనసుందని.. ఆ ఆప్యాయత వెనుక కుట్రలు కుతంత్రాలు దాగినావున్నాయని గ్రహించేలోపే జరగాల్సింది జరిగి పోతుంది.. మన జీవితాలు బుగ్గిపాలు అయ్యాయి.. ఊహకందని మలుపులు తిరుగుతాయి.. ఇంతటి ఘనాపాటి ఎవరో ఇప్పటికే మీకు అర్ధమైపోయింటుంది..

ఆయనే ప్రతిష్టాత్మక నియోజక వర్గంగా పేరుగాంచిన ఎల్‌ బీ నగర్‌ నియోజకవర్గపు ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి..
దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి ఈ పేరులోనే ధీరత్వం ఉంది.. మంచి కుటుంబ నేపథ్యం కూడా ఉంది.. రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేని వ్యక్తిగా కొంత పేరుంది.. అది ఒకప్పుడు.. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఎలాంటి భేషజాలు లేకుండా.. ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా సోకాల్డ్‌ రాజకీయ నాయకుడిగా అప్పట్లో స్వర్గీయ వై ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మన్ననలు అందుకున్న వ్యక్తిగా, మిస్టర్‌ క్లీన్‌ లెదర్‌ గా పేరు తెచ్చుకున్నారు సుధీర్‌ రెడ్డి..

- Advertisement -

ఇక కాంగ్రెస్‌ పార్టీలో కీలకమైన పదవులు నిర్వహించిన సుధీర్‌ రెడ్డి.. ఎల్‌ బీ నగర్‌ ఎమ్మెల్యేగా 2018 లో విజయం సాధించినా.. ఆతరువాత టి ఆర్‌ ఎస్‌ పార్టీలో చేరిపోయారు.. మంత్రి పదవి వస్తుందని ఆశించినా అది జరుగలేదు.. కాగా మూసీ నది అభివృద్ధి సంస్థ చైర్మన్‌ గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు బీ ఆర్‌ ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌.. ఇదంతా ఒక ఎత్తు.. అయితే ఎప్పుడైతే బీ ఆర్‌ ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నాడో.. సుధీర్‌ రెడ్డి అవినీతి అనే పదాన్ని దత్తత తీసుకున్నాడు.. ప్రజా సంక్షేమాలన్ని పక్కన బెట్టి కేవలం అక్రమార్జన వైపే అడుగులు వేశారు అన్నది నియోజక వర్గం ప్రజల మాట.. ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై అక్రమ కేసులు పెట్టడం.. వారిని నిర్బంధించడం.. వారిని ఇబ్బందులకు గురి చేయడం సుధీర్‌ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకుంటారు..
పేదలకు ఉపయోగ పడాల్సిన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ను సైతం తన అవసరాలకు వాడుకున్నాడనే అపవాదు కూడా ఆయన మీద ఉంది.. తన అత్తా, మామలకు సంబంధించిన ఆరోగ్య అవసరాల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 2 లక్షల వరకు విడుదల చేయించుకున్నాడనే విషయాన్ని ప్రజలు ఓపెన్‌ గానే చెబుతున్నారు.. ఒక మారుతి 800 నుంచి మొదలైన ఆయన ప్రస్తానం ఈరోజు రోల్స్‌ రాయల్‌ వరకు ఎదిగింది అంటే.. సుధీర్‌ రెడ్డి అవినీతి ఎలా కొనసాగింది అన్నది చెప్పకనే చెప్పవచ్చు.. సుధీర్‌ రెడ్డిని ఓడిద్దాం ఎల్‌. బీ. నగర్‌ ని కాపాడుకుందాం.. రక్షించుకుందాం.. అంటూ నియోజక వర్గ ప్రజలు కన్నీటితో తమ వేదనను వ్యక్తం చేస్తున్నారంటే.. ఇక్కడి పరిస్థితులు అర్ధం చేసుకోవచ్చు.. కనుక ఎల్‌ బీ నగర్‌ ఓటర్లు ఒక్కసారి ఆలోచించాలని రాజకీయ విశ్లేషకులు విజ్ఞప్తి చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు