Monday, April 29, 2024

ఏకగ్రీవం

తప్పక చదవండి
  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఎన్నికలకు ఇద్దరే నిమినేషన్లు
  • 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ

హైదరాబాద్‌ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు నుంచి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. నామినేషన్‌ దాఖలుకు గురువారం ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్‌ అభ్యర్థులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌లు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్‌ వేయలేదు. దీంతో, వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు.. శుక్రవారం నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థుల ఎన్నికపై ప్రకటన వెలువడనుంది. బీఆర్‌ఎస్‌ నేతలు కడియం శ్రీహారి, పాడి కౌశిక్‌ రెడ్డి రాజీనామాతో తెలంగాణ శాసన మండలిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడిరది. జనగామ, హుజూరాబాద్‌ స్థానాల నుంచి వీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధించారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సంఖ్యా బలం పెరిగింది. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు కాంగ్రెస్‌కు తగిన సంఖ్యాబలం ఉంది. దీంతో బల్మూరి వెంకట్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి ఎవరూ నామినేషన్‌ సైతం దాఖలు చేయలేదని తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు