Sunday, May 5, 2024

భూకంపాలను తట్టుకునేలా అయోధ్య

తప్పక చదవండి
  • ఆలయ నిర్మాణంలో ఆధునిక సాంకేతికత
  • వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేల నిర్మాణం

అయోధ్య : అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమ తేది సమీపిస్తున్న కొద్దీ.. ఆలయ నిర్మాణ విశేషాల కోసం చాలా మంది వెతుకుతున్నారు. ఎలాంటి భూకంపం, వరదలు వచ్చినా వెయ్యేళ్లపాటు తట్టుకునేలా ఆలయ డిజైన్‌ జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వారు అయోధ్యను ఒక ఇంజినీరింగ్‌ అద్భుతమని అభివర్ణిస్తున్నారు. కేవలం ఆధ్యాత్మిక స్థలంగానే కాకుండా గుడి నిర్మాణంలో ఎంతో సైన్స్‌ దాగి ఉందని అంటున్నారు. రామమందిరాన్ని టాటా, ఎల్‌ అండ్‌ టీ కంపెనీలు నిర్మించాయి. గుడి నిర్మాణ పక్రియలో అధునాతన టెక్నాలజీని వినియోగించాయి. సంప్రదాయ నాగర శైలి వాస్తు శిల్పం నుంచి ప్రేరణ పొంది రూపొందించిన 360 స్తంభాలు ఆలయంలో ఉన్నాయి. వాటిని పూర్తిగా రాయితో మలిచారు. ఎక్కడా ఇనుము, ఉక్కు, సిమెంట్‌ మిశ్రమాలను వాడలేదు. వీటితోపోల్చితే రాయికి జీవితకాలం ఎక్కువ, భూకంపాలు వచ్చిన తట్టుకోగలిగే సామర్థ్యం రాయికి ఉంటుందని అధికారులు తెలిపారు. తొలుత భారీ గొయ్యి తీసి.. దాన్ని 56 పొరల కాంపాక్ట్‌ కాంక్రీట్‌తో గట్టిపరిచారు. దీంతో పునాది మరింత పటిష్టంగా మారింది. పునాదులు వేసే దగ్గరి నుంచి పిల్లర్లు నిలబెట్టే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. బయటి ఉష్ణోగ్రతల ప్రభావం పునాదుల్లో ఫిల్‌ చేసే కాంక్రీట్‌ మిశ్రమంపై పడకుండా రాత్రిపూట మాత్రమే పనులు చేసేవారు. ఆలయ నిర్మాణానికి 150 మంది ఇంజినీర్లు, వేల సంఖ్యలో కార్మికులు రేయింబవళ్లు కష్టపడ్డారు. 6.5 తీవ్రతతో భూకంపాలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఆలయానికి ఉంది. నేపాల్‌ నుంచి అయోధ్య వరకు భూకంప తీవ్రతను కొలిచే నిపుణుల బృందం రిపోర్టునిచ్చింది. ఇంజినీర్లు కొన్ని దశాబ్దాలుగా ఆలయ పరిసరాల్లో నమోదవుతున్న వర్షపాతం రికార్డులను పరిశీలించి భవిష్యత్తులో వరదలు వచ్చినా రామమందిరంపై ప్రభావం పడకుండా డిజైన్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు