Saturday, May 11, 2024

మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ

తప్పక చదవండి
  • విద్యుత్ రంగంలో జరిగిన స్కాంలపై విచారణ
  • సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
  • షబ్బీర్ అలీని, అజారుద్దీన్‌ను ఓడించేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం
  • అదే మజ్లిస్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్న
  • తాము ఎవరికీ భయపడమన్న అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణ శాసన సభలో విద్యుత్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య వాగ్యుద్ధం నడిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, మజ్లిస్ పార్టీలు కలిసి పని చేశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం విద్యుత్ రంగంపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆందోళన కరంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఇప్పటివరకు విద్యుత్‌ రంగంలో రూ. 81వేల కోట్ల అప్పు ఉందని చెప్పారు. 2014 వరకు 10 వేల లోపు అప్పులు ఉంటే.. బీఆర్ఎస్ గత తొమ్మిదనరేళ్లలో 81 వేల కోట్లకు తీసుకెళ్లారన్నారు. ఈ అంశంపై చర్చను కొనసాగించిన మాజీ విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..తమ ప్రభుత్వ హయంలో అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్‌ ఇచ్చామన్నారు. విద్యుత్ రంగంలో చేయాల్సిన అభివృద్ధి ఎక్కడా ఆగకుండా జరిగిందని చెప్పారు. మధ్యలో కలుగజేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో రూ.20 వేల కోట్ల స్కామ్‌ జరిగిందని.. అందులో జగదీష్‌రెడ్డి రూ.10 వేల కోట్లు తిన్నాడన్నారు. కోమటిరెడ్డి ఆరోపణలుపై జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయటపెట్టాలని కోరారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్‌ మేరకు జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్లను కూడా చేరుస్తామన్నారు. మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలు, భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌, యాద్రాద్రి పవర్‌ప్లాంట్‌పై విచారణ జరిపిస్తామని సీఎం ప్రకటించారు. మొత్తం వాస్తవాలకు బయటకు తీయాల్సిన అవసరం ఉందని.. ప్రభుత్వం రంగంలో విద్యుత్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ సాధించింది గుండు సున్నా అని చెప్పారు. ‘ఆనాటి ప్రభుత్వం ఏనాడూ సభ ముందు వాస్తవాలు బయటపెట్టలేదు. విద్యుత్‌ శాఖను పూర్తిస్థాయిలో స్కానింగ్‌ చేసి.. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాం. జగదీష్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. విద్యుత్‌పై జ్యూడీషియల్‌ విచారణకు సిద్ధంగా ఉన్నాం. కరెంట్‌ అనే సెంటిమెంట్‌ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లపై ప్రశ్నించిన మమ్మల్ని నాడు మార్షల్స్‌ చేత బయటకు గెంటించారు. ఉద్యమంలో పని చేసిన తెలంగాణ విద్యుత్‌ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారు. రెండేళ్లలో భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఏడేళ్లు పట్టింది. భద్రాద్రి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది. ప్రాజెక్టు కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవలేదు. బ్యాక్‌ డోర్‌ నుంచి టెండర్లు అంటగట్టారు. ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ కూడా ఉత్పత్తి చేయలేదు. 24 గంటల ఉచిత విద్యుత్‌ అంటూ అబద్ధాలు చెప్తున్నారు. సభలో దబాయిస్తూ ఇంకా ఎంత కాలం గడుపుతారు ?. కోమటిరెడ్డి లాక్‌బుక్‌ చూపిస్తే.. బుక్‌లు మాయం చేశారు. ఇంకా ఎన్నాళ్లూ మోసం చేస్తారు ?’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం జ్యూడీషియల్ ఎంక్వైరీ ప్రకటనపై జగదీష్ రెడ్డి స్పందించారు. విద్యుత్‌ రంగంపై ఎలాంటి విచారణ అయినా జరిపించుకోండని.. అందుకు తాను సిద్ధమని ప్రకటించారు. విద్యుత్‌ కొనుగోళ్లపై కాగ్‌ నివేదికలు కూడా ఉన్నాయని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు