Friday, May 10, 2024

గత ప్రభుత్వంలో రైతుబంధుతోప్రజాధనం లూటీ

తప్పక చదవండి

పంటభూములకే ఇవ్వాలి.. బీడు భూములకు ఇవ్వొద్దు..

  • రైతుబంధు ఎంపిక పారదర్శకంగా ఉండాలి
  • సన్న చిన్న కారు రైతులకే రైతుబంధు సాయం
  • క్షేత్రస్థాయిలో రైతుల వివరాలు సేకరించాలి
  • రైతుబంధుతో భూస్వాములకు లబ్ధి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైతుకు భరోసా ఇవ్వాలని రైతు బంధు పథకాన్ని రూపొందించారు. ఈ పథకం 2018 మే లో కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ లో ప్రారంభించారు. అయితే పథకం బాగున్నప్పటికిని నిజమైన రైతులకు కాకుండా ఎంతోమంది బడా బాబులకు రైతుబంధును ఇచ్చి ఈ పథకాన్ని దుర్వినియోగం చేశారు. ఎప్పుడైనా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పేదలకు బడుగు బలహీన వర్గాలకు చేకూర్చే విధంగా ఉండాలి. కానీ ప్రభుత్వంలో రైతు బంధు పథకం అట్టర్‌ ప్లాప్‌ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిరుపేద రైతుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం అలా కాకుండా భూమి ఉన్న ప్రతి రైతుకు కూడా ఇవ్వడంతో తెలంగాణ ఖజానాకు గండి పడిరదనే చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు అదేమిటంటే గతంలో దొరలు, భూస్వాములు గ్రామాల్లో ఉన్న తమ భూములను రైతులకు ఇచ్చేసి వారి దగ్గర ఎంతోకొంత డబ్బులు తీసుకొని కాయితాలు రాసిచ్చారు. అలాంటి వారి భూములు మళ్లీ వారికే దక్కాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనతో రైతు బంధు అనే పథకానికి రూపకల్పన చేశాడు. రైతుబంధు పథకం కింద ఎవరైతే రైతుకు ప్రభుత్వం డబ్బులు వేసిందో వారు అధికారికంగా రైతులు అయిపోయారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందే ఊహించి రైతుబంధు ప్రవేశపెట్టిన తర్వాతనే ధరణిని ప్రవేశపెట్టారు. ఇందులో రైతుబంధు వస్తున్న ప్రతి రైతును ధరణి పోర్టల్‌ లో నిక్షిప్తం చేసి తెలంగాణ పేరిట రైతు పాస్‌ పుస్తకాలను ఇచ్చారు. అంతవరకు అనధికారికంగా ఉన్న వారిని కూడా పట్టేదారులను చేశారు. చాలామంది రైతులు రోడ్డున పడ్డారు. రైతు బంధు పథకం కూడా దొరలకు భూస్వాములకు లబ్ధి చేకూర్చేందుకే తీసుకువచ్చాడా అనే అనుమానం కూడా ప్రజల్లో కలిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతుబంధు లబ్ధిదారుల ఎంపికను పరదర్శకంగా చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.

- Advertisement -

గత ప్రభుత్వంలో రైతుబంధుతో ప్రజాధనం లూటీ

గత ప్రభుత్వంలో అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, ఎవరికి వారు యమునా తీరే అనే చందంగా వ్యవహరించారు అనడానికి నిదర్శనమే ఈ రైతుబంధు పథకం. ఇక్కడ కూడా ఈ రైతుకు భూమి ఉందా లేదా అని విచారించకుండా పాసుబుక్కు ఉంటే చాలు రైతుబంధు ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు కూడా దీన్ని ఆసరాగా చేసుకొని తమ అనునయులకు దొంగ పాస్‌ బుక్కులు సృష్టించి రైతుబంధు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పుడో అమ్ముకొని రిజిస్ట్రేషన్లు అయిపోయిన కూడా రెవెన్యూ రికార్డుల్లో మారకపోవడంతో అలాంటి భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు. ఉదాహరణకు ఫంక్షన్‌ హాల్‌, పెట్రోల్‌ పంపులు, రైస్‌ మిల్లులు, గోడౌన్స్‌, స్పెషల్‌ ఎకనామికల్‌ జోన్‌ కింద పోయిన భూములకు తీసుకున్న భూములకు కూడా రైతుబంధు పథకం కింద ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఇలా వేలకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి బడాబడా నాయకులకు లబ్ధి చేకూర్చారు. దింతో తెలంగాణ రాష్ట్రము ఆర్థిక ఇబ్బందులో పడిపోయింది.

క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల వివరాలు నమోదు చేయాలి
ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని పలువురు మేధావులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గ్రామాల్లోకి వెళ్లి గ్రామసభలు నిర్వహించి రైతుల ముందే నిజమైన రైతులను ఎంపిక చేసి ఆ నివేదికలను ప్రభుత్వానికి అందజేయాలని ప్రజలు సూచిస్తున్నారు.

గత ప్రభుత్వంలో లేఔట్లకు ఇండ్లకు గుట్టలకు ఇచ్చి పథకాన్ని దుర్వినియోగపరిచారు
పేద రైతులకు ఆర్థిక వనరు కోసం చేపట్టిన రైతు భరోసా పథకాన్ని గత కెసిఆర్‌ ప్రభుత్వంలో ఫాట్లుగా చేసిన లేఅవుట్లు, ఇండ్లు, గుట్టలు, భవనాలు నిర్మించుకున్న స్థలాలకు రైతుబంధు పథకాన్ని ఇచ్చి దుర్వినియోగపరిచారు. ఇప్పుడు అలా కాకుండా పథకంలో పలు మార్పులు చేపట్టి పథకాన్ని నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు చేపట్టాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. దీనికోసం అధికారులకు కొన్ని కఠినమైన ఆదేశాలు జారీ చేయాలి. లబ్ధిదారుల ఎంపికలు ఎక్కడైనా తేడా జరిగితే అధికార బాధ్యత వహించాలనే నిబంధనను తీసుకువచ్చి ప్రభుత్వం దీనిని పారదర్శకంగా నిర్వహించాలి. తప్పు చేసిన వారిని బాధ్యులను చేస్తే మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో రెవెన్యూ అధికారులు తాసిల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్సెక్టర్‌తో పాటు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో తిరిగి అక్కడ గ్రామ కార్యదర్శి సహాయం తీసుకోని నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. పథకంలో మిగిలే డబ్బును ఇంకో పథకాలకు ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇలా చేస్తే ప్రజలకు ప్రభుత్వం పై విశ్వాసం నమ్మకం కలుగుతాయని ప్రజా ప్రభుత్వం దిశగా పోతుందని పలువురు మేధావులు సూచిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు