Friday, May 3, 2024

ఆ ఖాకీ తీరు మారదా.?

తప్పక చదవండి
  • కిందిస్థాయి సిబ్బందిపై హెడ్‌ కానిస్టేబుల్‌ పెత్తనం..
  • గతంలో అతనిపై ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు..
  • ఈయన తీరుతో కానిస్టేబుల్‌ ఫరీద్‌కు అస్వస్థత..
  • చికిత్స కోసం గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌ తరలింపు..

కోదాడ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : గత కొన్ని నెలలుగా పోలీస్‌ స్టేషన్‌ లో పతుక పోయినా హెడ్‌ కానిస్టేబుల్‌ ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగుతూ వస్తుంది.ఆయన చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా లేవు.కోదాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ తన పని తను చేసుకోకుండా క్రింది స్థాయి సిబ్బంది పై అజమాయిషీ చలాయిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తూ ఆఖరికి ఆస్పటల్‌ పాలయ్యే వరకు తీసుకువచ్చింది.కోదాడ పోలీస్‌ స్టేషన్‌ లో పనిచేసే ఫరీద్‌ (కానిస్టేబుల్‌)కు గుండెకు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ చిన్నపాటి చికిత్స చేయించుకుని ప్రతి రోజు విధులు నిర్వహిస్తున్నారు.అయిన కూడా స్టేషన్‌ లో రైటర్‌ గా పని చేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ సాగర్‌, కానిస్టేబుల్‌ ఫరీద్‌ తో నువ్వు సరిగా డ్యూటీ చేస్తున్నావా.? నువ్వు ఏం పని చేస్తున్నావు.? నువ్వు అధికారులు చెప్పినట్టు వినడం కాదు. నేను చెప్పిందే వినాలి,నేను చెప్పిన పని చేయాలని అతన్ని గట్టిగా బెదిరించే దోరణి తో దూరసుగా మాట్లాడటం తో,ఒక్క సారిగా మనస్థాపానికి గురైన ఫరీద్‌ కి ఒకే సారి బ్లడ్‌ ప్రెజర్‌ పెరిగి కుప్పకూలికి కింద పడిపోయాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది, వెంటనే అతన్ని పట్టణంలోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌ కి తరలించారు. ఈ వ్యవహారం అంతా బయటకు పొక్కకుండా అధికారులు,ఫరీద్‌ ను మోరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు.హెడ్‌ కానిస్టేబుల్‌ తీరు బాగొలేకపోవడం,అతనిపై పలు పిర్యాదులు రావడం తో, ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యల కింద హెడ్‌ క్వార్టర్‌ కి అటాచ్‌ చేశారు.అయినప్పటికీ అతనిలో ఎటువంటి మార్పు రాకపోగ,మళ్ళీ ఉన్నతాధికరుల కాళ్ళ వెళ్ళ పడి మళ్ళీ అదే స్టేషన్‌ లో రైటర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.సాగర్‌ తరచూ కిందిస్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతూ, స్టేషన్‌ కి వచ్చేవారిని,అక్కడ పని చేసే అధికారులను సైతం డామినేట్‌ చేస్తూ, మొత్తం నేను చెప్పినట్టే జరగాలనే విధంగా వ్యవహరిస్తారని స్టేషన్‌ కి వచ్చే పలువురు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. స్టేషన్‌ కి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం ఎస్సైలు, సీఐలు చేయాల్సిన కేసులను కూడా అతనే నేరుగా చేస్తాడని ఆరోపణలు బహిరంగం గానే వినపడుతున్నాయి. ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు