Monday, April 29, 2024

తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన..!

తప్పక చదవండి
  • త్వరలోనే పార్లమెంట్‌ ఎన్నికలకు కిషన్‌రెడ్డి కొత్త టీమ్‌..!

హైదరాబాద్‌ : పార్ల మెంటు ఎన్నికల ముందు తెలంగాణ కాషాయసైన్యంలో సంస్థాగత ప్రక్షాళనపర్వానికి రంగం సిద్ధమైంది. ఇక అంతా కిషన్‌రెడ్డి మార్క్‌ కనిపించనుంది. న్యూ ఇయర్‌లో నయా టీమ్‌ రాబోతోంది. పనిచేయని వారిపై మీద వేటు వేయడానికి అంతా సిద్దమైంది. కొత్త ఏడాది, కొత్తవారంలోనే ఈ మార్పులు కనిపించబోతున్నాయి. కొత్త నాయకులకు కొత్త టార్గెట్‌ ఇవ్వబోతున్నారు.తెలంగాణలో 15 జిల్లాలకు కొత్త అధ్యక్షులను మార్చడం దాదాపు ఖాయమైంది. 15 జిల్లాలకు కొత్త కెప్టెన్లు వస్తున్నారు. ఈ మార్పులకు రెండు ప్రాతిపదికలు ఉన్నాయి. ఒకటి, ఆరోపణలు వచ్చినవారిని, సరిగా పనిచేయని వారిని పక్కనబెట్టడం. రెండోది, దీర్ఘకాలంగా అధ్యక్షులుగా కొనసాగుతున్నవారికి ఆ పదవుల నుంచి ఉద్వాసన పలకడం గ్యారంటీ అంటున్నారు. రాష్ట్ర పదాధికారుల్లోను మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఈ మార్పుల కోసం జాబితాను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కసరత్తులు చేస్తున్నారు.మొన్న అమిత్‌ షా టూర్‌ తర్వాత, ఈ ప్రక్రియ జోరందుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పది సీట్లు సాధించాలని అమిత్‌ షా, తెలంగాణకు లక్ష్యం నిర్దేశించారు. ఈ టార్గెట్‌ను చేరుకోవాలంటే, కొత్త టీమ్‌ కావాలి. అందుకే కిషన్‌రెడ్డి కసరత్తు చేశారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులతో కిషన్‌రెడ్డి చర్చలు జరిపారు. అంతేగాదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి భరతం పట్టడంపై కూడా కిషన్‌రెడ్డి ఫోకస్‌ చేశారు. వారిపై వచ్చిన ఫిర్యాదులపై బీజేపీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. రేపో మాపో, వీళ్లకు కూడా కమిటీ నోటీసులు ఇస్తుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి. ఈ జోష్‌ పార్లమెంటు ఎన్నికల్లో కంటిన్యూ కావాలంటే, మార్పులు తప్పనిసరి అని కిషన్‌రెడ్డి భావించారు. లోక్‌సభలో 400 సీట్లు టార్గెట్‌ పెట్టుకున్న బీజేపీ హైకమాండ్‌, ఇందుకు గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చిందని అంటున్నారు. మొత్తమ్మీద 15 జిల్లాలకు కొత్త అధ్యక్షులు వస్తున్నారు. వీరితోపాటు పదాదికారుల్లో కూడా కొత్తవారికి చోటు లభిస్తుంది. ఈ మార్పులతో బీజేపీకి బలం టానిక్‌ లభిస్తుందని అంచనాలు వస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు