Tuesday, October 15, 2024
spot_img

కబ్జాదారులారా ఖబర్దార్‌

తప్పక చదవండి
  • అధికారులైనా, రాజకీయ నాయకులైన
  • ఎవరైనా పేదల భూముల జోలికి వస్తే తాట తీస్తా
  • మీ భూములను కబ్జా చేస్తే నేరుగా నా దగ్గరకి రండి..
  • కబ్జా చేసింది ఎవ్వడైనా ఎంతటివాడైనా నేను మీకు న్యాయం చేస్తా
    -ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించే వరకు పోరాడుతా..
    -చేవెళ్ల కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇంఛార్జి భీమ్‌ భరత్‌

శంకర్‌పల్లి : శంకర్‌ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని గత శతాబ్ద కాలంనుండి గ్రామ అవసరాలకు ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో దొంగ పత్రాలను ఇనాం భూముల పేరుతో సృష్టించి కబ్జా చెయ్యాలని చూస్తున్న విషయాన్ని తనదృష్టికి తీసుకు వచ్చినందున తాను స్థానికులకు మద్దతుగా నిలబడతానని భీమ్‌ భరత్‌ హామీ ఇచ్చారు. ఇంత కాలం జరిగిన దోపిడీ ని ఇక పై జరగనివ్వనని ఆయన స్థానికులకు భరోసా ఇచ్చారు.ప్రభుత్వం పేద వారికి ఇచ్చిన అసైన్డ్‌ భూములు, సమాధులను, ముస్లిం సోదరుల సమాధులు ఉన్న ప్రదేశాలను దొంగ పత్రాలతో స్థానిక దళారులను మూడు పెట్టుకుని రియల్‌ ఎస్టేట్‌ చేసి పేదల, ప్రభుత్వ భూముల ద్వారా కోట్లు గడిరచాలని చూస్తున్న వారి ఆటలు ఇక పై సాగవని వారినిహెచ్చరించారు, త్వరలో సంబధిత అధికారులతో విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిని కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. బాధితుల పక్షాన చివరి వరకు పోరాడి న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక చెందిప్ప గ్రామ సర్పంచ్‌ స్వప్నమోహన్‌, ఉప సర్పంచ్‌ స్వర్ణలత శివరాం, సదానందం గౌడ్‌, పెద్దోళ్ల కుమార్‌, ఎండీ అజీజ్‌, ప్రవీణ్‌ కుమార్‌ కొండ, ములమల్క శ్రీను, శంకర్‌ పల్లి మండల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉదయ్‌ మోహన్‌ రెడ్డి, దేవుల నాయక్‌, మండల అధ్యక్షులు జనార్దన్‌ రెడ్డి, రాములు,మైసయ్య, పెద్దల ప్రశాంత్‌ రెడ్డి, దమ్మన సాయి రెడ్డి మండల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మహబూబ్‌ హుస్సేన్‌. కైయౌమ్‌ భాయ్‌, అండూరి పెంటయ్య, ధోబిపేట్‌ సమీ, దయాకర్‌ రెడ్డి, కృష్ణ, అస్లాం, జాంగిర్‌ భాయ్‌, ప్రశాంత్‌ కుమార్‌, అనిల్‌, బద్దం కృష్ణ రెడ్డి, సంజయ్‌, నయీమ్‌, శ్రీకాంత్‌, చందిప్ప గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్‌
సికింద్రాబాద్‌,31డిసెంబర్‌(ఆదాబ్‌ హైదరాబాద్‌): గంజాయిని అక్రమంగా తరలిస్తూ, విక్రయిస్తున్న ఇద్దరిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులతో కలిసి సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ టాస్క్ఫోర్స్‌ బృందం పట్టుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హబ్సిగూడలో గంజాయి విక్రయిస్తున్న కనుకుర్తి సాయినవీన్‌ అలియాస్‌ కుల్ఫీ (27) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సాయినవీన్‌ కు చాట్ల వంశీ (19) గంజాయిని విక్రయించాడు. ఒడిశా నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి అధిక లాభాలకు వంశీ విక్రయించేవాడు. పోలీసులు వంశీని అదుపులోకి తీసుకుని 900 గ్రాముల గంజాయి, ఒక ఫోన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వివిధ పోలీస్‌ స్టేషన్‌, ఎక్సైజ్‌ స్టేషన్లలో సాయినవీన్‌ పై 6 ఎన్డీపీఎస్‌, రెండు ఇతర కేసులు, వంశీపై ఒక ఎన్టీపీఎస్‌ కేసు, మూడు ఇతర కేసులు నమోదై ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు