Wednesday, May 8, 2024

ఆన్‌లైన్‌లోనూ ఫ్రీగా అయోధ్య హారతి పాసులు..

తప్పక చదవండి
  • హారతి కార్యక్రమానికి కేవలం 30 మంది భక్తులకే అనుమతి
  • భవిష్యత్‌లో ఈ పరిమితిని సడలించే అవకాశం
  • ఆధార్‌, ఓటర్‌ ఐడీ ఏదైనా చూపించి పాసులు తీసుకోవచ్చు

హైదరాబాద్‌ : ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు భక్తులను ఆహ్వానిస్తోంది ఆలయ ట్రస్టు. ఇప్పటివరకు ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న పాసులను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం రోజుకు మూడు పూటలు హారతి కార్యక్రమం ఉంటుందని ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. భక్తులకు ఉచితంగానే ఈ పాసులను అందిస్తోంది ట్రస్టు. హారతి కార్యక్రమానికి 30 మంది భక్తులకే అనుమతి ఉంటుందని సంబంధిత అధికారి అన్నారు. భద్రతా కారణాల రీత్యా హారతికి 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నారని, భవిష్యత్‌లో ఈ పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అన్నారు. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌లో ఏదైనా చూపించి పాసులు తీసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో 20 చొప్పున పాసులు అందుబాటులో ఉంటాయని, నచ్చిన తేదీలకు ముందస్తు బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు