Friday, May 3, 2024

బీఆర్‌ఎస్‌ అవినీతి పానలకు చరమగీతం

తప్పక చదవండి
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే
  • ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ

నిజామాబాద్‌ : తెలంగాణలో ఇక బిఆర్‌ఎస్‌ అవినీతి పాలన అంతం కాబోతున్నదని, బీజేపీ, బిఆర్‌ఎస్‌ రెండూ తెలంగాణ ద్రోహ పార్టీలని అన్నారు. బోధన్‌లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం,నరేంద్ర మోడీ నల్లచట్టాలు చేసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారు.. నాకు ప్రభుత్వ ఇంటిని తొలగించారని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కేసీఆర్‌ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని.. అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్‌ ఒకటే అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కారు పంచర్‌ అయ్యిందన్నారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం చేశారని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌తో ఎమ్మెల్యేకు భూములు అప్పగిస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. దొరలకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. పేదల కోసం కాంగ్రెస్‌ పోరాడుతుందని స్పష్టం చేశారు. మళ్ళీ అధకారంలోకి వేస్తే భూములు గుంజుకుంటారని విమర్శించారు. కేసీఆర్‌ చదువుకున్న పాఠశాల కాంగ్రెస్‌ పార్టీ కట్టిందే అని తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని ఐటీ సిటీ చేసింది కాంగ్రెస్‌ అని.. మెట్రో కాంగ్రెస్‌ హయంలోనే వచ్చిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దోపిడీదారులన్నారు. లిక్కర్‌ మాఫియా, భూదందా కేసీఆర్‌ కుటుంబంలో ఉందని దుయ్యబట్టారు. దళితబంధు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్ దారి మళ్లించారని ఆరోపించారు. వచ్చేది ప్రజల ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. మొదటి క్యాబినెట్‌ విూటింగ్‌లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హావిూ ఇచ్చారు. బీజేపీ ఏ బిల్లు పెట్టినా కేసీఆర్‌ మద్దుతు ఇచ్చారన్నారు. మూడు బిల్లులను తాను కళ్ళారా చూసినట్లు తెలిపారు. తెలంగణ తన సొంత ఇల్లు అని పేర్కొన్నారు. కేసీఆర్‌ విూద ఒక్క కేసు పెట్టలేదని.. కేసీఆర్‌కు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌, బీజేపీని తరిమికొట్టాలని.. కేంద్రంలో బీజేపీని, మోడీని ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ తెలంగాణలో, మోడీ ఢిల్లీ లో రాజ్యమేలుతున్నారని అన్నారు. కారు టైరులు కాంగ్రెస్‌ పంచర్‌ చేసిందని.. బీఆర్‌ఎస్‌ గాలి తీశారని.. ఢిల్లీకి వెళ్లి మోడీని పంచరు చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల తెలంగాణ తెచ్చుకుందామని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు