Monday, April 29, 2024

ఖమ్మంలో ప్రియాంక భారీ రోడ్‌ షో

తప్పక చదవండి
  • భారీగా తరలి వచ్చిన ప్రజలు

ఖమ్మం : జిల్లాలోని ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ రోడ్‌ షో విజయవంతంగా జరిగింది. అశేష ప్రజానీకం ప్రియాంకకు ఘనస్వాగతం పలికింది. పాలేరు నియోజకవర్గం పెద్ద తండా వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రియాంక తెలుగులో మాట్లాడారు. మార్పు రావాలంటే కాంగ్రెస్‌ రావాలి అంటూ పదే పదే తెలుగులో ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ తెలుగులో నినదించారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అశేషజనవాహిని హర్షధ్వానాల నడుమ ప్రియాంకా గాంధీ ప్రసంగం కొనసాగింది. ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని భట్టి విక్రమార్క తెలుగులో వివరించారు.విూరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. కేసీఆర్‌ విూకు ఉద్యోగాలు ఇచ్చాడా. కేసీఆర్‌ కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయి. విూకు ఉద్యోగాలు కావాలా?. బీఆర్‌ఎస్‌ను తప్పించండి విూకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి. తెలంగాణ రాష్ట్ర రైతులు, ఆడబిడ్డలు, యువత ఈ రాష్టాన్ని తెచ్చుకుంది. విూ అందరికీ ఒక కల ఉంది ఆ కల నెరవేరాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి. 10 సంవత్సరాల నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టించింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందో అక్కడ ఉద్యోగాలు వచ్చాయి… ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. విూరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఉద్యోగాలు, ఇళ్ళు, వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే రైతుల రుణాలు మాఫీ అవుతాయి. శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. భారీ మెజారిటీతో వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. మార్పు కావాలి, కాంగ్రెస్‌ రావాలి. పొంగులేటి శ్రీనివాస రెడ్డిని , తుమ్మల నాగేశ్వరరావును, భట్టి విక్రమార్కను భారీ మెజారిటీతో గెలిపించండి‘ అని ప్రజలను ప్రియాంక కోరారు. అవినీతి కెసిఆర్‌ పాలనను అంతమొందించాలన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు