Monday, April 29, 2024

నేటి ఉదయం ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ప్రమాణం

తప్పక చదవండి
  • అక్బర్‌ ఉంటే ప్రమాణం చేసేది లేదన్న రాజాసింగ్‌
  • ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ కొత్త అసెంబ్లీ శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. స్పీకర్‌ ఎన్నిక వరకూ ప్రొటెం స్పీకర్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 8:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ప్రమాణం చేయనున్నారు. అసెంబ్లీ వాయిదా తర్వాత అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీంను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ నున్నారు. అనంతరం అక్కడి నుంచి నిమ్స్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ నున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పది లక్షలతో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ హావిూ ఇచ్చిన విషయం విదితమే. అక్కడి నుంచి నిమ్స్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

ఇదిలావుంటే అక్బరుద్దీన్‌ ఉండగా తాము ప్రమాణం చేయమని గోషామహల్‌ బిజెపి ఎంపి రాజాసింగ్‌ ప్రకటించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్బరు ద్దీన్‌ ఓవైసీ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ప్రమాణస్వీకారం చేసేది లేదని తేల్చిచెప్పారు. రజాకార్ల వారుసులైన ఎంఐఎం నేత సమక్షంలో ఓథ్‌ తీసుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు.2018లో కూడా ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌ ఉన్నందున ప్రమాణం చేయలేదని… ఈసారి కూడా అదే నిర్ణయం ఉంటుందని రాజాసింగ్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి అధ్యక్షతన శనివారం బీజెఎల్పీ బ్రేక్‌ ఫాస్ట్‌ విూటింగ్‌ జరుగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే ప్రమాణ స్వీకారంపై రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో మిగతా 7 మంది ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాక కిషన్‌రెడ్డి విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు