Thursday, May 16, 2024

కేసీఆర్‌ కోసం ఆస్పత్రికి ఎవరూ రావద్దు

తప్పక చదవండి
  • కార్యకర్తలకు హరీష్‌ రావు సూచన

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను పరామర్శిం చేందుకు ఎవరూ హాస్పిటల్‌ రావొ ద్దని అభిమా నులకు, కార్యకర్త లకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలక డగానే ఉందని అభిమాను లు ఆందోళన చెందవద్దన్నారు. కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నారు. కేసీఆర్‌ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్‌ రావు తెలిపారు.బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కాలుజారి పడటంతో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తుంటి ఎముక మార్పిడి చేయాలని, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడిరచారు. కాగా, దవాఖానలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం వల్ల పెద్ద శస్త్ర చికిత్స జరుగనుంది. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు తాము కూడా ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు