Friday, May 3, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఎన్నికలొస్తేనే నాయకులకు
ప్రజలు గుర్తుకొస్తుంటరు..
ఇంటిట తిరుగుతూ కడుపులో
తలకాయ పెడతరు..
గదువ పట్టుకుంటరు..
ఎవరు చూడక పోతే కాళ్ళు పట్టుకుంటరు..
ఇది నేటి రాజకీయ
నాయకుల ట్రిక్కులు,
అసలే తెలంగాణను తాగుబోతుల
రాష్ట్రంగా పిలుస్తున్నరు..
ఈ బిరుదు ఎవరి పుణ్యమో?
అందుకేనేమో ఎన్నికల్లల మద్యం,
డబ్బుల పంపకాలు జోరుగ జరుపుతరు..
ఒక్కొక్క నాయకుడు బ్యాంకుల్లో
దాచుకున్న డబ్బుల కుప్పలు ఎగజల్లుతారు.
ఆ డబ్బులతో నిలవ నీడ లేని
పేదోళ్లకు ఎన్ని వందల ఇండ్లు
కట్టీయా వచ్చునో!
పోనీ రెండు పూటల తిండికి
లెనోళ్ళను ఆదుకుంటారంటే మొఖం చాటిస్తరు.
ఇది మన ప్రజా ప్రతినిదులు,
నాయకుల తీరు..
మారదు నిరుపేద ప్రజల
బతుకులు మారవు..

` మామిడి రమేష్‌ హన్మకొండ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు