Monday, May 6, 2024

ధర్మరక్షణ కోసం పోరాటం

తప్పక చదవండి
  • భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి
  • కరీంనగర్‌లో భారీ ర్యాలీతో నామినేషన్‌
  • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బండి
  • ప్రజలకు అండగా నిలబడతానని హావిూ
  • బీజేపీ తేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది
  • ఆనాడు పార్లమెంటులో మా మద్దతుతోనే రాష్ట్రం
  • కేసీఆర్‌ కొట్లాడితే కాదు.. బీజేపీ మద్దతుతో ఏర్పాటు
  • రైతులు, నిరుద్యోగుల కోసం కొట్లాడితే కేసులు
  • గంగుల భూ కబ్జాలకు చెక్‌ పెట్టాలని పిలుపు
  • కరీంనగర్‌లో మీడియా సమావేశంలో బండి సంజయ్‌

కరీంనగర్‌ : కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సోమవారం రోజున నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రసంగిస్తూ నేను ధర్మరక్షణ కోసం చివరి శ్వాస దాకా పోరాడుతూనే ఉంటానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఉద్ఘాటించారు. ప్రతి ఇంటికి రక్షకుడిగా ఉంటానన్నారు. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా, రaాన్సీ లక్ష్మీబాయిలా బయటకు వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కరీంనగర్‌ లోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద నుండి నిర్వహించిన బైక్‌ ర్యాలీలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్‌ రెడ్డి, ధర్మపురి అసెంబ్లీ అభ్యర్ధి ఎస్‌.కుమార్‌, చీకోటి ప్రవీణ్‌ కుమార్‌ తదతరులతో కలిసి బండి సంజయ్‌ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఆనాడు బిజెపి మద్దతుతోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. ‘రైతులు, నిరుద్యోగులు కోసం కొట్లాడితే నాపై ముప్పై కేసులు పెట్టారు. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ నిధులు, నేషనల్‌ హైవే నిధులు నేనే తీసుకొచ్చానని అన్నారు.. గ్రామపంచాయతికి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విూటింగ్‌కు ప్రజలెవరూ రావడం లేదు. కాళేశ్వరం రిపోర్టు కరెక్ట్‌ కాదా?, కాళేశ్వరం పిల్లర్లకి పగుళ్లు వచ్చినవి నిజం కాదా అని ప్రశ్నించారు. కరీంనగర్‌ ఎన్నికల పలితాల కోసం యావత్‌ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. విూ కోసం కొట్లాడిన వారిని అసెంబ్లీకి పంపాలి. మంత్రి గంగుల కమలాకర్‌ బాధితుల సంఘం ఏర్పాటు చేసే పరిస్థితి కరీంనగర్‌లో ఉందన్నారు. ల్యాండ్‌ కబ్జాలకు కేరాఫ్‌ గంగుల కమలాకర్‌, అతని అనుచరులు ఉన్నారు.
కరీంనగర్‌ మొత్తం కాషాయమైందని ఇంతమంది ఎందుకొచ్చారు? ధర్మం కోసమా? కాదా? కరీంనగర్‌ లో కాషాయ జెండా ఎగరేద్దాం.. ధర్మాన్ని నిలబెడదాం అనిమా చేతిలో ఉండేది కాషాయ జెండానే. విూరిచ్చిన కాషాయ జెండాను కొందరు మర్చిపోయారు. ఎంపీగా నా చేతికి కాషాయ జెండా అందించింది విూరే.. 1.2 లక్షల ఓట్లేశారు. ఏనాడూ నేను వదిలిపెట్టలేదు. కాషాయ జెండాను రెపరెపలాడిరచాను. ధర్మ రక్షణ కోసం పనిచేసిన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ నియంత పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగిన. హిందూ ఓట్‌ బ్యాంకును ఏకం చేసిన. ఎన్నికల్లో బీజేపీకి విజయపరంపర కొనసాగించినం. చాలా పార్టీలు హిందూ సమాజాన్ని చులకన చేశాయి. నాలో కసి పెరిగింది. ధర్మంపై కక్ష కట్టిన వాళ్ల సంగతి చూడాలనుకున్న. 80 శాతం ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చడమే లక్ష్యంగా పనిచేసిన. 150 రోజులు పాదయాత్ర చేసిన. రైతుల కోసం కాళ్లు చేతులు విరిగినా లెక్క చేయలే. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ చేస్తే నిరుద్యోగుల కోసం పోరాడి జైలుకు పోయిన. 317 జీవో పేరుతో ఉద్యోగులను చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తే వాళ్ల పక్షాన జైలుకు పోయిన. తెలంగాణలో ఏ వర్గానికి అన్యాయం చేసినా వాళ్ల పక్షాన పోరాడిన. నాపై 30కి పైగా కేసులు పెట్టినా లెక్క చేయలే.రజాకార్ల పాలన నుండి ప్రజలను రక్షించేందుకు నేను పోరాడుతుంటే నాపై మతతత్వ ముద్ర వేస్తున్నరు. పాతబస్తీలో సభ పెట్టి పాతబస్తీని అభివృద్ధి చేస్తామంటే… ముస్లిం మేధావుల్లో మార్పు వచ్చింది.. రబ్బర్‌ చెప్పులు… జీన్స్‌ ప్యాంట్‌ వేసిన యువకులే కరీంనగర్‌ చరిత్రను మార్చబోతున్నరు. ఎంపీగా గెలిపిస్తే ఏం చేశావని కొందరు నాపై దుష్ప్‌ చారం చేస్తున్నరు. మూడేళ్లలో 8 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. స్మార్ట్‌ సిటీ నిధులు కేంద్రానివే. రేషన్‌ బియ్యం సహా పల్లెల్లో, మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే.ఇయాళ సీఎం అంటున్నడు.. తెలంగాణ జెండా ఎన్నడైనా బీజేపీ పట్టిందా? అంటున్నడు… సిగ్గుండాలే… కేసీఆర్‌… నీ పార్టీ పుట్టకముందే తెలంగాణ తీర్మానం చేసినం. 1998లో కాకినాడ తీర్మానం గుర్తు చేసుకో. నీ పార్టీకి ఉన్న ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వచ్చేదా? పార్లమెంట్‌ లో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతుంటే తాగి పండిన చరిత్ర నీది. ఆనాడు బిల్లు పెట్టించి రాష్టాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే.కేసీఆర్‌ కొడుకుకు అహంకారం ఎక్కువయ్యేది. బీజేపీ కార్యకర్తలను సన్నాసులంటవా? విూ అయ్య లేకుంటే నీది బిచ్చపు బతుకయ్యేది. విూ కథ ముగిసింది. విూ సభలకు జనం వచ్చే పరిస్థితి కూడా లేదు. మేడిగడ్డపై కేంద్రం వాస్తవ నివేదిక ఇస్తే… తప్పుపడుతున్న కేసీఆర్‌ కొడుకుకు సిగ్గుండాలే. ఈ ఎన్నికలు కరీంనగర్‌ కే పరిమితం కావు… తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతున్నయ్‌. 50 లక్షల మంది నిరుద్యోగ యువత, ఉద్యోగ, ఉపాధ్యాయులు, లక్షలాది మంది రైతులు, విద్యార్థులు, మహిళలంతా విూ తీర్పు కోసం ఎదురు చూస్తున్నరు. వాళ్ల తరపున కొట్లాడే బండి సంజయ్‌ ని గెలిపించాలని కోరుతున్నరు. విూరిచ్చే తీర్పు కరీంనగర్‌ చరిత్రను తిరగరాయబోతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి సివిల్‌ సప్లయిస్‌ మంత్రిగా ఉన్నడు. ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్‌ కార్డు ఇచ్చాడా? ఎంతమందికి ఇండ్లు ఇచ్చారో చెప్పాలి. ఎటు చూసినా అవినీతి, అక్రమాలే. చివరకు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తే కవిూషన్లతో నింపుకున్నడు. ఇక బుద్ది చెప్పే టైమొచ్చింది.ఇక్కడ పొరపాటున బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఎంఐంకు మేయర్‌ పదవిచ్చేందుకు సిద్ధమైనారు. అదే జరిగితే పరిస్థితి ఎట్లుంటదో ఆలోచించండి అన్నారు. నామినేషన్‌కు ముందు తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. దేవాలయంలో పూజలు నిర్వహించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు