Tuesday, May 7, 2024

బీఎస్పీ లోకి కొడకంచి మాజీ సర్పంచ్..

తప్పక చదవండి
  • నీలం మధు కు మద్దతుగా వచ్చి చేరుతున్న యువత..

బహుజన ఆత్మగౌరవం కోసం గొంతెత్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్పి పార్టీ నుంచి బరిలో ఉన్న నీలం మధు ముదిరాజ్ కి సబ్బండ బహుజన వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా పెద్ద ఎత్తున నాయకులు యువత బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. జిన్నారం మండలం కొడకంచి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నీలం మధు సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకున్నారు. రాళ్లకత్వ కు చెందిన 20 మంది యువకులతో పాటు అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంజీరా నగర్ కు చెందిన 30 మంది యువకులు నీలం మధుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ బీఎస్పీ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారందరికీ నీలం మధు బీఎస్పీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ బహుజన ఆత్మగౌరవ నినాదంతో ముందుకు వెళుతున్న తనకు స్వచ్ఛందంగా మద్దతిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. ప్రతి ఒక్కరూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి మద్దతు ఇచ్చి ఏనుగు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు