Monday, April 29, 2024

తెలుగుదేశం వద్దనుకున్నప్పుడు నేనెందుకు?

తప్పక చదవండి
  • పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేస్తా
  • విజయవాడ ఎంపి కేశినేని నాని సంచలన ప్రకటన

విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ‘చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్‌ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢల్లీి వెళ్లి లోకసభ స్పీకర్‌ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను‘ అని నాని ఎక్స్‌ వేదికగా తెలిపారు. నిన్నటి నుంచి కేశినేని నాని సంచలనాలకు తెరదీస్తున్నారు. ఫేస్‌బుక్‌ వేదికగా నిన్న ఎంపీ కేశినేని నాని ఒక పోస్ట్‌ పెట్టారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. ఈ క్రమంలోనే నేడు రాజీనామా చేయబోతున్నట్టు ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఇదిలావుంటే చందర్లపాడు మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. లోక్‌సభ స్పీకర్‌ అనుమతి కోరానని.. స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కేశినేని నాని అన్నారు. ఆపై మావాళ్ళు ఏం చెయ్యమంటే అదే చేస్తానన్నారు. ఇందులో తన సొంత నిర్ణయం ఉండదని కేశినేని నాని తెలిపారు. తాను ఏం చేసినా పారదర్శకంగా చేస్తానన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా తెల్లవారు జామున పోస్ట్‌లో పెడుతున్నానన్నారు. దాన్ని మీడియా ఫాలో అవ్వటమేనని.. రోజూ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనన్నారు. ఇక్కడ ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేశానన్నారు. ప్రజలను, తనతో ఉన్న వాళ్ళను వదిలేసి నిర్ణయాలు తీసుకోలేనని కేశినేని నాని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు