Thursday, May 2, 2024

మోతె మండలం మామిళ్లగూడెం వద్ద బస్సు బోల్తా

తప్పక చదవండి
  • హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న బస్సు
  • అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తింపు

సూర్యాపేట జిల్లా మోతె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వల్ప గాయాలు మినహా… ఎవరికీ ఏమీ కాలేదు. ఖమ్మం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. మోతె మండలం మావిళ్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు రహదారి పక్కకు దూసుకుపోయింది. ముందు వెళ్తున్న వాహనం టైరు పగలడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కకు మల్లించాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు సూర్యాపేట జిల్లా మావిళ్లగూడెం వద్దకు వెళ్లగానే బస్సు ముందు వెళ్తున్న వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు మల్లించాడు. బస్సు కంట్రోల్ తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు