Saturday, April 27, 2024

ఎక్సైజ్‌ శాఖలో ఎవరీ.. రవీందర్‌ రావు?

తప్పక చదవండి
  • తన పదవీకాలం పొడిగింపు కోసం చట్టాన్ని మార్పించుకున్న ఘనుడు..
  • ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారి తీగల రవీందర్‌రావు సర్వీసు మొత్తం మోసపూరితమెనా!
  • కూతురు విదేశాల్లో ఉన్నందున బ్లాక్‌ మనీ అంత వైట్‌ మనీ అని పోజులు
  • ఇతగాడి అక్రమ వ్యాపారాలు టానిక్‌ క్యూ మార్ట్‌ల పర్యవేక్షనంత కొడుకుదేనా?
  • ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపులో మమ(త)తాను రాగల సీరియల్‌ కథలు ఎన్నెన్నో..
  • ఇవే కాకుండా ఫార్మా సిటీ ముచ్చర్ల, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వందల కోట్లు విలువ చేసే భూములు
  • రంగారెడ్డి జిల్లా లో 25 సంవత్సరాలు ఇతగాడి సర్వీస్‌ కొనసాగింపు పై అనుమానాలు ఎన్నో
  • ఎక్సైజ్‌ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అవినీతి బాగోతం అంతా తీగల రవీందర్‌రావు అనే చిలుకలోనే..
  • ముఖ్యమంత్రి రేవంత్‌ ఇతనిపై విచారణ జరిపితే గత ప్రభుత్వ పెద్దల బాగోతాలు బయటపతాయి..

ఎక్సైజ్‌ శాఖలో ఈఎస్‌ గా ఉన్నత పదవిలో ఉన్న తీగల రవీందర్‌రావు లీలలు అన్నీ ఇన్ని కావు ఇతగాడి అవినీతి భాగోతాలను చూస్తుంటే ఎవరి టక్కరి వాడు ఇప్పటికీ చిక్కినాడు అన్న విధంగా ఉన్నది. హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 40 ఎలైట్‌ బార్ల కు పర్మిషన్లు ఇచ్చారు. ఒక్కో బార్‌ కు సుమారు 40 లక్షల చొప్పున అమ్యమ్యాలు తీసుకున్నట్లు వాటిని ఎక్సైజ్‌ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మరియు ఆప్కారి శాఖ రవీందర్‌రావు పంచుకున్నారని గట్టి ఆరోపణలు వస్తున్నాయి. ఇదే కాకుండా ఈవెంట్స్‌లకు పర్మిషన్లలో దొంగ రిసిప్‌ట్లు ఇచ్చిన వారందరిపైన కేసులు అయినాయి. ఆ కేసులను అమ్యమ్యాలు తీసుకుని నీరుగార్చిన ఘనత తీగల రవీందర్‌దే.ఎక్సైజ్‌ శాఖలో ఇతను ఏకచత్రాధిపత్యం వహించాడు అనడంలో సందేహం లేదు. వారు లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చిన ఎలైట్‌ బార్ల వైపు ఐదు సంవత్సరాలుగా కన్నెత్తి కూడా చూడలేదు. ఎవరైనా వాటి వైపు వెళ్తే వారిని దూర ప్రాంతాలకు బదిలీలు చేయించేవారని తెలుస్తోంది ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్న ఇతగాడి బయటపడని లీలలు ఎన్నెన్నో? రంగారెడ్డి జిల్లాలోనే 25 సంవత్సరాలుగా కొనసాగడం చూస్తుంటే ఈయన మామూలోడు కాదనిపిస్తుంది. ఇతగాడు చేస్తున్నవన్ని మోసపూరిత పనులే తనపై ఎవరన్నా ఫిర్యాదు చేసిన ప్రశ్నించిన వారిని ఎక్కడో దూరంగా ఉండే మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయించే సత్తా కూడా ఇతని దగ్గర ఉన్నది. తన సొంత శాఖలో ఉద్యోగులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి తన దారికి తెచ్చుకోవడంలో ఇతను దిట్ట. గత ప్రభుత్వంలో అతను నియంత! తాను ఏది చెప్తే అదే జరగాలనేది ఇతని నైజం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇతను చేయని అరాచకాలు లేవు !చేస్తున్నది ఆప్కారి శాఖలో ఉన్నత ఉద్యోగం. సీఐగా, ఏఈఎస్‌,ఈఎస్‌గా ఒకే జిల్లాలో పదోన్నతులు పొందుతూ ప్రస్తుతం ఈఎస్‌గా కావడం చూస్తుంటే ఇతగాడికి గత ప్రభుత్వ పెద్దల అండదండలు ఎంతగా ఉన్నాయో అర్థమవుతుంది.


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వెలుమదొరలు ఉద్యోగ్గులుగా పెట్టి పుట్టారు. పుడితే పుట్టాలి రా వెలవగానే అనే రీతిలో వ్యవహారాలు ఉన్నాయి. ఇతగాడి పదవి కాలాన్ని పొడిగించి కొనసాగించడానికి ఉద్యోగ చట్టంలో మార్పులు చేసి 58 ఏళ్ల ఉద్యోగ విరమణ కాలాన్ని 61 సంవత్సరానికి అనుకూలంగా మలుచుకున్న ఘనత కూడా ఇతనికి దక్కుతుంది. ఇందులో ఇతడు ఒక్కడే బాగుపడ్డాడని కాదు ఇతనుతోపాటు గతంలో టీఎన్‌జీఓ యూనియన్‌లో కూడా ఇతర కాడి లీలలు ఉన్నాయి ఇతనే కాకుండా ఉన్నత పదవిలో (టీఎన్‌జీఓ యూనియన్‌ లో )ఉన్న ఒక మహిళా అధికారి (మమత) భర్త కూడా ఉన్నారు. కొంతమంది కెసిఆర్‌ బందు వర్గం దగ్గరి అనునయులకు ఉద్యోగ కాలాన్ని పొడిగించడం కోసమే ఈ పాలసీని తీసుకురావడం జరిగిందంటున్నారు.

- Advertisement -

ఇతగాడికి పదుల సంఖ్యలో బార్లు, బిర్యాని పాయింట్లు ఇతర వ్యాపారాలు..?
తీగల రవీందర్రావుఎక్సైజ్‌ శాఖలో ఈఎస్‌గా ఉంటూ అక్రమ బార్లు బిర్యానీ పాయింట్లు ఇతరత్రా దందాలను ఇతని సుపుత్రుడు చూస్తుంటాడు. అతని పర్యవేక్షణలోనే టానిక్‌ లిక్కర్‌ మార్ట్లు బార్లు బిర్యాని పాయింట్లు నడుస్తుంటాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ గలీజ్‌ దందాలను వెలగబెడుతున్నారు. ఇతగాడేమో తన కూతురు విదేశాల్లో ఉన్నది అనిఆమె అక్కడ ఉద్యోగం చేసి పంపించె డబ్బులని, ఇతగాడి చేసే అక్రమ వ్యాపారుల వల్ల వచ్చే బ్లాక్‌ మనీ అంతా వైట్‌ మనీ అని పోజులు కొడుతూ ఉంటాడు. నేనేం చేసినా నన్ను ఎవరు ఏం పీకలేరు అని లెవెల్‌ లో ఇతడి దందాలు ఉంటాయి. అతడి దందాలకు ఎవరు అడ్డు వచ్చినా వారిని ఏదో రకంగా ఇబ్బందులకు గురిచేసి తన అక్రమ కార్యకలాపాలకు అడ్డు లేకుండా చేసుకోవడం ఇతడి నైజం పాపాల భైరవుడి పని పట్టాలంటున్న కొంతమంది అబ్కారీ శాఖ ఉద్యోగులు ప్రజలు కోరుకుంటున్నారు.

ఎక్సైజ్‌ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అవినీతి బాగోతం అంతా తీగల రవీందర్రావు అనే చిలకలో ఉంది..
వీరిద్దరూ కలిసి వైన్స్‌ టెండర్లలో షాపులు దక్కించుకున్న వ్యాపా రులను బెదిరించి తమ దారికి వచ్చే విధంగా చేసుకునేవారు. టెండర్‌ లో ఎవరుకి షాపు దక్కిన వారికి నుండి వైన్స్‌ లను లాక్కు న్నారు వారికి ఇస్తామన్న డబ్బులు ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నా యి. కాదు కూడదు అంటే లేదంటే అబ్కారీ అధికారి రవీందర్‌ రావ్‌ రంగంలోకి దిగుతాడు. ఎక్సైజ్‌ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అండదండలతో వారిపై అక్రమ కేసులు పెడతామని ఇబ్బందులకు గురి చేసినారు. ఇలా గత అయిదు సంవత్సరాలు వీరి అవినీతి అనుబంధానికి అంత ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ఉన్నకొన్ని బార్లలో, వైన్‌ షాపుల్లో, లిక్కర్‌ మార్ట్‌ లలో వాటాలు ఉన్నాయి. అనే ఆరోపణలు కోకొల్లలు వీరు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక చాలామంది లిక్కర్‌ వ్యాపారులు తమ లైసెన్స్‌ లను ఎంతకో అంతకు వీరికే ఇచ్చేవారని తెలుస్తుంది. గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారంలో వీరి భాగ్యస్వామ్యంలో వందల కోట్లు చేతులు మారాయని అనుకుంటున్నారు. ప్రభుత్వం మారిన ఇతగాడి బుద్ధి మారలేదు ఇంకా అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇతగాడికి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా బినామీలుగా ఉన్నారననే ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్రమ వ్యాపారాల్లో పలువురు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా లోగోట్టు పెరుమాళ్ళ ఎరుక అనే విధంగా ఉన్నది ఇతగాడి వ్యవహారం.
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అబ్కారీశాఖ ఈఎస్‌ తీగల రవీందర్రావుపై విచారణ జరిపితే గత ప్రభుత్వ పెద్దల భాగోతాలు బయటపడతాయి.. ఎక్సైజ్‌శాఖ ఈఎస్‌ తీగల రవీందర్‌రావుపై పూర్తిస్థాయి విచారణ జరిపితే ఈయన తో కలిసిగతంలో వ్యాపారం చేసిన చేస్తున్న కొంతమంది గత ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల అవినీతి అక్రమ భాగోతాలు బయటపడతాయని. ప్రజలు భావిస్తున్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి అధికారుల భరతం పట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు