Monday, April 29, 2024

సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తప్పక చదవండి

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) : సామాజిక ఉద్యమ ఉపాధ్యాయురాలు, భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు
స్త్రీ జన సముద్ధరణకు అంకితమైన మహా మనీషి సావిత్రిభాపూలే
స్త్రీ విద్యతో సమాజ ప్రగతిని కాంక్షించిన వీరవనిత సావిత్రిభాపూలే వివిధ రంగాల స్త్రీ ప్రతినిధులకు విశిష్ట పురస్కారాల అందచేత – సావిత్రిబాపూలే జయంతి ఉత్సవ సభలో పాల్గొని ప్రసంగించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, మాజీ పిసిసి అధ్యక్షుడు బి. హనుమంత రావు.
స్త్రీలకు విద్యతో సమాజ ప్రగతిని మహోన్నతంగా సాధించవచ్చని, ప్రత్యేక పాఠశాలలను నెలకొల్పి, విద్యాబుద్ధులు నేర్పిన తొలి భారత ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాపూలే సేవలు చరిత్ర పుటలలో చిర స్థాయి అని కేంద్ర పర్యాటక శాఖామాత్యులు జి. కిషన్ రెడ్డి కొనియాడారు. స్త్రీ జాతి సముద్ధరణ సేవలు నిరుపమానమైనవన్నారు. పూలే దంపతుల ఆశయ సాధన దిశగా చట్ట సభలలో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి వీలుగా ప్రత్యేక చట్టంను తెస్తున్న ఘనత తమదేనని ఆయన తెలిపారు. సావిత్రిబాపూలే 193వ జయంతిని తెలంగాణ జన జాగృతి ఘనంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించింది వివిధ రంగాలకు చెందిన మహిళా మూర్తులకు విశిష్ట పురసారారాలను అందజేస్తారు.
ఇందులో భాగంగా విశిష్ట అతిధులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు వి. హనుమంత రావు, మహిళా ప్రతినిధులు నాగ పరిమళ, ఉషశ్రీ, పల్లవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జన జాగృతి అధ్యక్షుడు కె.పి. మురళి కృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా సభలో డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ప్రసంగిస్తూ…. తొలి ఉపాధ్యాయురాలుగానే కాకుండా, సంఘ సంస్కర్తగా, మనవ హక్కుల నేతగా సావిత్రిబాపూలే చేసిన కృషి ఎప్పటకీ ఆదర్శనీయమైనదే అన్నారు. ఎన్ని చట్టాలు అమలులోకి తెచ్చినప్పటికీ, ఇప్పటకీ స్త్రీలపై జరుగుతున్న దుస్సంఘటనలు కలతను కల్గిస్తున్నాయన్నారు. ఇలాంటి వాటిపై సామాజిక బాధ్యతగా ప్రజలందరూ తిప్పి కొట్టాల్సిన అనివార్యత వుందన్నారు.
మాజీ పిసిసి అధ్యక్షుడు వి. హనుమంత రావు ప్రసంగిస్తూ రాష్ట్రంలో నెలకొల్పిన మహిళా విశ్వవిద్యాలయానికి సావిత్రిబాపూలే పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్యానికి విజ్ఞప్తి చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయుత్యాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహళా ప్రతినిధులు పాల్గొన్నారు. సామాజిక, వైద్య, విద్య, రాజకీయ తదితర రంగాలకు చెందిన 50 మంది మహిళా ప్రతినిధులకు ముఖ్య అతిధులు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, వి. హనుమంత రావు తదితరులు జ్ఞాపికలు, శాలువాలతో సన్మానించారు.
కె.పి. మురళి కృష్ణ తెలంగాణ జన జాగృతి

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు