Saturday, May 4, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలి….

తప్పక చదవండి
  • పుట్ట లక్ష్మణ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) ; తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ సహాయ కార్యదర్శి గ్యారా నరేష్,ఓయూ కార్యదర్శి నెల్లి సత్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పాత్ర మరువలేనిదని కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించకుండా ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా నూతన హాస్టల్లో నిర్మించకుండా విశ్వవిద్యాలయాల నిర్వీర్యం చేసి వారి పార్టీకి చెందిన నేతలకు ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతులు ఇచ్చిందని అన్నారు. నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియంతృత్వ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక బిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించారు. కావున నూతన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు చేయకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయవలసిందిగా వారు కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలు.

- Advertisement -
  1. విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి.
  2. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇతర యూనివర్సిటీలకు ఒక్కో యూనివర్సిటీ కి 300 కోట్ల నిధులు కేటాయించాలి.
  3. నూతన హాస్టల్ నిర్మించి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించాలి.
  4. పిజి, పి.హెచ్.డి విద్యార్థులకు ఫెలోషిపులు ఇవ్వాలి.
  5. విశ్వవిద్యాలయాల భూములను కాపాడాలి.
  6. విశ్వవిద్యాలయాల లో పరిశోధనలను పెంపొందించడానికి ప్రతి యూనివర్సిటీకి 50 కోట్ల నిధులు కేటాయించాలి.
  7. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కు అయిన విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి.
  8. విశ్వవిద్యాలయాలలో పెంచిన అన్ని కోర్సుల ఫీజులు తగ్గించాలి.
  9. సెల్ ఫైనాన్స్ కోర్సులను అన్ని కూడా రెగ్యులర్ కోర్సులుగా మార్చాలి.
  10. నూతన ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పైన రివ్యూ మీటింగ్ నిర్వహించాలి.
    ఈ మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు లెనిన్, నాయకులు ఉదయ్, భగత్, ఆశ్వన్,రమేష్,మధు సాయి, ప్రదీప్, పాల్గొన్నారు.

లెనిన్ , నెల్లి సత్య
ఏఐఎస్ఎఫ్ – అద్యక్ష &కార్యదర్శులు
ఉస్మానియా యూనివర్సిటీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు