Thursday, May 2, 2024

అనుమతులు లేని బాంబుల తయారీ

తప్పక చదవండి

స్థావరంపై అధికారుల దాడులు..ఆదాబ్‌ కథనానికి స్పందన..

  • బాంబులు తయారు చేయడానికి ఉపయోగించే పొడి స్వాధీనం..
  • రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..
  • కద్దర్‌ చొక్కా నాయకుల ఫైర్‌తో అధికారులు ఆగమాగం

సూర్యాపేట : ఎలాంటి అను మతులు లేకుండా దీపావళి బాంబులు విచ్చలవిడిగా తయారు చేస్తున్నారని, ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రికలో వచ్చిన వార్త కథనంపై జిల్లా, మండల అధికారులు స్పందించారు. చివ్వెంల తహసిల్దార్‌ రంగారావు ఆదేశాల మేరకు ఆర్‌.ఐ రామారావు సంఘటన స్థలానికి, స్థానిక చివ్వెంల పోలీసులతో కలిసి సంఘ టన స్థలానికి వెళ్ళారు. దీపావళి బాంబులు తయారు చేస్తున్న గుడిసెలను పరిశీలించి టపాసులు పేలడానికి వాడుతున్న పొడి (పొటాషియం సల్ఫర్‌, సోడ ఉప్పు, బొగ్గు పొడి, ఇతర పదార్థాలు)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అను మతులు లేకుండా బాంబులు తయారు చేస్తున్న ఖాసింపేట గ్రామానికి చెందిన గౌస్‌ ఫై, రెవెన్యూ అధి కారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎక్స్‌ పోజ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు కానీ, రిమాండ్‌ చేయలేదని పోలీసులు తెలిపారు. తయారు చేసిన బాంబులు ఎక్కడ.? అనుమతులు లేకుండా గత కొన్ని రోజు లుగా తయారుచేసిన బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకోకుండానే వెళ్లినట్లు తెలుస్తోంది. తయారు చేసిన బాంబు లన్ని ఒక రూమ్‌లో భద్రపరచగా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే సంఘటన స్థలంలో దొరికిన పొడిని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకొని చేతులు దులుపు కున్నారు. అక్రమంగా తయారీ చేస్తున్న టపాసులు స్వాధీనం చేసుకో కుండానే వెళ్లడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్‌ అధికా రులను వివరణ కోరగా.. చివ్వెంల మండల పరిధిలోని ఖాసింపేట గ్రామంలో అనుమతులు లేకుండా దీపావళి బాంబులు తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు అయిందని తెలిపారు. ఏ ఆక్ట్‌ కింద కేసు నమోదు చేశారని అడగగా.! అలా చెప్పకూడదని కేసు అయిందని రాసుకో అంటూ సమాధానం దాటవేశారు. అక్రమ తయారీలో పట్టుబడ్డ వ్యక్తికి పొలిటికల్‌ నాయకులు గట్టి ఫైరో కాల్స్‌ రావడంతో, కక్క లేక మింగలేక కేసుల వివరాలు కూడా తెలుపకుండా వ్యవహరిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు