Thursday, May 2, 2024

జర్నలిస్టుకు బెదిరింపులు

తప్పక చదవండి

“ఆదాబ్” జర్నలిస్టుకు ఫోన్ చేసి బెదిరించిన సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి

  • జీవోలు చదువుకొని వార్తలు రాయాలని రాంపతి హుకుం..
  • మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, సి.ఎం.ఆర్ బియ్యం సేకరణతో తనకేం సంబంధం లేదని తెగేసి చెప్పిన వైనం
  • మరోసారి సి.ఎం.ఆర్ బియ్యం వార్తలు రాస్తే బాగుండదని వార్నింగ్..
  • కాల్ రికార్డు చేసుకో.. రికార్డు చేసుకున్నా, నన్ను ఎవరు ఏం చేయలేరు! పెరుమాళ్ళ నర్సింహారావు,
  • ప్రత్యేక ప్రతినిధి సూర్యాపేట జిల్లాలో రైస్ మిల్లర్ల వద్ద పేరుకుపోయిన కోట్లాది రూపాయల సి.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం బకాయిల గురించి గడిచిన కొద్ది రోజులుగా “ఆదాబ్” ఆధారాలతో కూడిన వరుస కథనాలను ప్రచురిస్తోంది. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ అమలు చేసిన సీఎంఆర్ పాలసీ కారణంగా ఆ శాఖ 56 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సంబంధిత శాఖ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న పలువురు మిల్లర్ల వద్ద ఎలాంటి పూచికత్తు, గ్యారెంటీలు తీసుకోకుండానే గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల వడ్డీలకే కేవలం రూ. 3 వేల కోట్లు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చెల్లించాల్సి వస్తోందని, 18 వేల కోట్ల విలువైన ధాన్యం ఇంకా మిల్లర్ల వద్దనే ఉండిపోయిందని, మిల్లర్ల వద్ద సదరు ధాన్యం ఎంత ఉందో కూడా సరైన తనిఖీ నివేదికలు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ వద్ద లేవని మంత్రి వాపోయిన విషయం తెలిసిందే. ఇదే సి.ఎం.ఆర్ బియ్యం బాగోతాన్ని “ఆదాబ్” గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ కాలము నుండి అనేక వార్తలు వెలుగులోకి తెస్తూనే ఉంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 20వ తారీకున “ఆదాబ్” “సూర్యాపేట జిల్లా సి.ఎం.ఆర్ బకాయి రూ. 960 కోట్లు” అనే శీర్షికతో బ్యానర్ వార్త ప్రచురించింది. ఈ వార్త వచ్చిన 6 రోజుల తర్వాత కానీ సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి సోయిలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. గడిచిన మంగళవారం రాత్రి ‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రిక తెలంగాణ బ్యూరో పెరుమాళ్ళ నర్సింహారావుకు సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి అనే ప్రభుత్వ అధికారి ఫోన్ చేసి బెదిరింపులకు బరితెగించాడు. సీఎంఆర్ వార్తలు రాసేటప్పుడు ప్రభుత్వ జీవోలు చదువుకొని రాయాలని రాంపతి హుకుం జారీ చేశాడు. రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, సి.ఎం.ఆర్ బియ్యం సేకరణతో తనకేం సంబంధం లేదని ఆయన తెగేసి చెప్పడం అర్థరహితం. తన ఫోన్ కాల్ రికార్డు చేసుకోవాలని, నువ్వు.! రికార్డు చేసుకున్నా.. నన్ను జిల్లాలో ఎవరేం చేయలేరని అధికారి రాంపతి తనకు తానే కితాబ్ ఇచ్చుకున్నాడు. మరోసారి సి.ఎం.ఆర్ బియ్యం వార్తలు ఈవిధంగా రాస్తే.. బాగుండదని ఆదాబ్ ప్రతినిధికి వార్నింగ్ ఇచ్చాడు. రాంపతిపై “ఆదాబ్” ఫిర్యాదు
  • సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి బెదిరింపులపై ఉన్నత స్థాయి అధికారులకు ఆదాబ్ ఫిర్యాదు చేయనుంది. రాత్రి సమయంలో ఆయన ఫోన్లో ఏ విధంగా మాట్లాడాడో సదరు వివరాలు అధికారులకు అందించి, రాంపతిపై శాఖా పరమైన చర్యలు తీసుకునే విధంగా ఫిర్యాదు చేస్తుంది. ఈ విషయమై సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరువురు స్పందించి మీడియా ప్రతినిధులపై ఇలాంటి దాదాగిరీ చేస్తున్న అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదాబ్ కోరుతోంది .
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు