Tuesday, October 15, 2024
spot_img

కప్పేసిన పొగమంచు..

తప్పక చదవండి
  • మంచు దుప్పట్లో చిక్కుకున్న ఉత్తరభారతం
  • జీరో స్థాయికి పడిపోయిన విజిబిలిటీ
  • ఢిల్లీలో 7 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
  • 10 విమానాలు, 25 రైళ్ల రాకపోకలకు ఆలస్యం

పొగమంచు ఢిల్లీని అతలాకుతలం చేసింది. మొన్నటివరకు తీవ్ర వాయు కాలుష్యంతో విలవిలలాడిన ఢిల్లీ.. ప్రస్తుతం చలితో వణుకుతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. 50 మీటర్ల దూరంలో కూడా వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాతావరణ శాఖ ఢిల్లీలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. పొగమంచు దట్టంగా పరుచుకోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 110 విమాన రాకపోకలపై ప్రభావం పడింది. అలాగే, 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

మరోవైపు పొగమంచు రవాణా వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ పడింది. ఢిల్లీకి వెళ్లే దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వేశాఖ తెలిపింది. అదేవిధంగా దాదాపు 110 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. చలికి తోడు ఢిల్లీలో గాలి నాణ్యత కూడా బాగా క్షీణించింది. సగటు గాలి నాణ్యత 381కి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం, ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఏక్యూఐ 441 నమోదు కాగా.. సెంట్రల్ ఢిల్లీలోని లోధి రోడ్‌లో 327గా నమోదైంది. ఐజిఐ విమానాశ్రయంలో ఏక్యూఐ 368 వద్ద ఉంది. వచ్చే వారంలో గాలి నాణ్యత మరింత తగ్గుతుందని వాతవరణశాఖ అంచనా వేస్తుంది.

- Advertisement -

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు