Sunday, April 28, 2024

చంద్రబాబు పిటిషన్ ను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

తప్పక చదవండి
  • పిటిషన్ ను విచారించిన జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం
  • అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదీల ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పిటిషన్ ను విచారిస్తామని… అంతవరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మరోవైపు ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 9, గత నెల 13, 17, 20వ తేదీల్లో జరిగింది. అయితే, స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని ధర్మాసనం ఇంతకు ముందే తెలిపింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడకపోవడంతో విచారణను మరోసారి వాయిదా వేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు