Monday, April 29, 2024

తెలంగాణను అప్పులకుప్పగా చేశారు

తప్పక చదవండి
  • మిగులు బడ్జెట్‌తో ఇస్తే ఐదులక్షల కోట్ల అప్పు పెట్టారు
  • కెటిఆర్‌ వ్యాఖ్యలపై డిప్యూటి సిఎం భట్టి ఆగ్రహం

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల పాలనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్‌ ఇచ్చారు. 55 ఏళ్లు ఏం చేశారని మమ్మల్ని అంటున్నారు. అది బాగాలేదనే తెలంగాణ తెచ్చుకున్నాం. మిగులు బ్జడెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టాము. ఐదు లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చారు. సంపదతో కూడిన తెలంగాణను విధ్వంసం చేశారని అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు విధ్వంసం జరిగింది అంటున్నారు. మరి 50 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడొద్దా. తాగునీరు సాగునీరు విద్యుత్‌ ఇవ్వలేని అసమర్థులు. మొదటి రోజే ఇంత భయపడితే ఎలా. మూడు నెలలు సమయమిస్తే కచ్చితంగా అట్టర్‌ ప్లాప్‌ అవుతుంది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర తెలంగాణ కాంగ్రెస్‌ నేతలదని అంటూ కేటీఆర్‌ విరుచుకుపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు